కొత్త అస్త్రాన్ని సంధిస్తోన్న రష్యా.. సిరియాలో నరమేధం సృష్టించిన జనరల్‌కు యుద్ధ బాధ్యతలు

ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాకు ఊహించని ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. యుద్ధ రంగంలో వేలాది మంది సైనికులను పోగొట్టుకుంది. వందలాది యుద్ధ సామాగ్రి ధ్వంసమయ్యింది. అటు, ఆర్థికంగా పలు దేశాలు ఆంక్షలు విధించడంతో మాస్కో ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ నేపథ్యంలో కొత్త వ్యూహాలను అమలు చేస్తున్నారు వ్లాదిమిర్ పుతిన్. సిరియా యుద్ధంలో క్రూరుడిగా గుర్తింపు పొందిన కమాండర్‌ను రంగంలోకి దింపింది. దీంతో మరోసారి కీవ్, మాస్కో మధ్య భీకర యుద్ధం తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి.
By April 11, 2022 at 08:11AM
By April 11, 2022 at 08:11AM
No comments