ప్రధానిగా ఉన్నప్పుడు హెలికాప్టర్‌లో పీఎంఓకి ఇమ్రాన్.. రూ.40 కోట్ల ఖర్చు
ప్రతిపక్షాల ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయిన ఇమ్రాన్ ఖాన్.. ప్రధాని పదవి నుంచి తప్పుకున్నారు. అవిశ్వాసంలో వీగిపోయి రాజీనామా చేసిన తొలి పాక్ ప్రధానిగా ఆయన చరిత్ర సృష్టించారు. అయితే, పదవిలో ఉండగా ఇమ్రాన్, ఆయన అనుచరులు పలు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవలే కానుకల విషయంలో ఇమ్రాన్‌ఫై ఎఫ్ఐఏ కేసు నమోదుచేసిన దర్యాప్తు చేపట్టింది. ప్రధాని షెహబాజ్ షరీఫ్ సైతం ఇమ్రాన్ దుబాయిలో నగలు అమ్ముకున్నారని ఆరోపించారు.
By April 22, 2022 at 12:31PM
By April 22, 2022 at 12:31PM
No comments