ప్రపంచ బాధ్యతలను నిర్వర్తిద్దాం.. ఉక్రెయిన్ యుద్ధంపై బైడెన్‌కు జిన్‌పింగ్ పిలుపు
ఉక్రెయిన్‌తో యుద్ధం విషయంలో రష్యాకు సైనిక సహకారం అందిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని చైనాను ఇంతకు ముందే అమెరికా హెచ్చరించింది. రష్యాకు సహకరిస్తే చైనాను శిక్షిస్తామని తెలిపింది. ఇదే సమయంలో అమెరికా, చైనా అధ్యక్షుల మధ్య భేటీ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరువురు నేతలూ వీడియో ద్వారా దాదాపు 2గంటల పాటు సమావేశమైన వివిధ అంశాలపై చర్చించారు. బైడెన్, జిన్‌పింగ్ మధ్య జరిగిన వీడియో సంభాషణ స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10.53 గంటలకు ముగిసినట్టు వైట్‌హౌస్ వెల్లడించింది.
By March 19, 2022 at 07:58AM
By March 19, 2022 at 07:58AM
No comments