పంజాబ్: అంతర్జాతీయ కబడ్డీ ప్లేయర్ దారుణ హత్య.. వీడియో వైరల్
అంతర్జాతీయ స్థాయి దారుణ హత్యకు గురైన ఘటన పంజాబ్‌లో సోమవారం చోటుచేసుకుంది. జలంధర్ జిల్లాలో నిర్వహిస్తున్న కబడ్డీ టోర్నమెంట్‌లో ఈ ఘటన జరిగింది. కబడ్డీ ప్లేయర్ అంబియాన్ (40)పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపినట్టు పోలీసులు తెలిపారు. తీవ్ర గాయాలతో ఉన్న ఆయనను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. సందీప్ శరీరంలో 8 నుంచి 10 వరకు బుల్లెట్లు దూసుకెళ్లినట్టు పోలీసులు పేర్కొన్నారు. జలంధర్ జిల్లా నకోడర్ సమీపంలోని మల్లియన్ ఖుర్ద్ గ్రామంలో టోర్నమెంట్ నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు. క్రీడా ప్రాంగణం నుంచి సందీప్ బయటకు వస్తుండగా.. నలుగురు వ్యక్తులు కాల్పులు జరిపారని పేర్కొన్నారు. సందీప్‌పై దుండగులు బుల్లెట్ల వర్షం కురిపించారని, 10 వరకు బుల్లెట్లు దూసుకెళ్లాయని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చెట్లు చాటుగా నిలబడి ఉన్న కొందరు ఓ వ్యక్తిపై కాల్పులు జరుపుతున్నట్టు వీడియోలో కనబడుతోంది. అయితే, వీళ్లు ఎవరనేది మాత్రం స్పష్టంగా కనిపించడం లేదు. రూరల్ డీఎస్పీ లఖ్విందర్ సింగ్ మాట్లాడుతూ... సందీప్ సింగ్ నంగల్ స్వస్థలం షాకోట్‌లో నంగల్ అంబియాన్ గ్రామమని తెలిపారు. కానీ, ఆయన బ్రిటన్‌లో స్థిరపడ్డారని చెప్పారు. బ్రిటన్ పౌరసత్వం ఉందని, ఇక్కడ టోర్నీలు నిర్వహించడానికి సొంతూరుకు వస్తుంటాడని తెలిపారు. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన సందీప్‌ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారని, అప్పటికే ఆయన చనిపోయినట్టు పేర్కొన్నారు.
By March 15, 2022 at 09:05AM
No comments