ప్రభాస్ క్యారెక్టర్ ఇదంటూ పూజా హెగ్డే ఓపెన్.. ఆయనతో మనస్పర్ధలపై ఫుల్ క్లారిటీ!!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బ్యూటిఫుల్ హీరోయిన్ జంటగా నటించిన చిత్రం 'రాధే శ్యామ్'. చాలా కాలంగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. మార్చి 11న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. అయితే చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న హీరోయిన్ పూజా హెగ్డే.. క్యారెక్టర్ గురించి మాట్లాడింది. అదేవిధంగా తనకి ప్రభాస్‌కి మధ్య మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు వచ్చాయంటూ వస్తున్న వార్తలపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. రాధే శ్యామ్ షూటింగ్‌లో భాగంగా పలు సందర్భాల్లో ప్రభాస్- పూజా హెగ్డే మధ్య మనస్పర్ధలు తలెత్తినట్లు ఆ మధ్య కాలంలో వరుస కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే. మొదట్లో ఈ విషయమై చిత్ర యూనిట్ సైలెంట్‌గా ఉండటంతో అది నిజమే అని అంతా భావించారు. పూజా వల్ల షూటింగ్ విషయంలో యువి క్రియేషన్స్ ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నట్లు టాక్ వినిపించింది. ఆ విషయంలో ప్రభాస్ కలుగజేసుకుని ఆమెను మందలించారని చెప్పుకున్నారు. అయితే అది నిజం కాదని చివరకు చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. ఇక ఇప్పుడు అదే విషయమై నోరువిప్పింది పూజా హెగ్డే. ప్రభాస్‌తో మనస్పర్ధలు వచ్చాయని షికారు చేసిన వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది పూజా హెగ్డే. రెగ్యులర్ షూటింగ్‌లో తామిద్దరం చాలా ఫ్రెండ్లీగా ఉండే వాళ్ళమని, తన కోసం ప్రభాస్ కొన్నిసార్లు ప్రత్యేకంగా స్పెషల్ ఫుడ్ ఐటమ్స్ కూడా తీసుకువచ్చారని చెప్పింది. తను చాలా మంచి వ్యక్తి అంటూ ప్రభాస్‌పై ప్రశంసలు కురిపించింది పూజా హెగ్డే. దీంతో టోటల్‌గా ఈ ఇష్యూకి ఫుల్‌స్టాప్ పడినట్లయింది. రాధే శ్యామ్ విషయానికొస్తే.. కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాను రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే అప్‌డేట్స్ వదులుతూ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశారు. వంశీ, ప్రమోద్, ప్రశీద నిర్మాతలుగా అత్యంత గ్రాండ్‌గా రూపొందిన ఈ పాన్ ఇండియా సినిమాలో సచిన్ ఖేడ్కర్, మురళీ శర్మ, భాగ్యశ్రీ, ప్రియదర్శి, కునాల్ రాయ్ కపూర్, ఫ్లోరా జాకబ్ ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ప్రభాస్ కెరీర్‌లోనే అత్యధిక థియేటర్స్‌లో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.
By March 09, 2022 at 09:37AM
No comments