Breaking News

ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం: ఏడుగురు సజీవదహనం.. 60 గుడిసెలు దగ్దం


దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం అర్ధరాత్రి ఘోర సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు సజీవదహనం కాగా.. 60కిపైగా గుడిసెలు తగలబడ్డాయి. ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. మొత్తం 13 ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఘటనా స్థలంలో ఏడు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈశాన్య ఢిల్లీ అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ దేవాన్ష్ కుమార్ మహ్లా మాట్లాడుతూ.. అగ్ని ప్రమాదం గురించి శుక్రవారం అర్ధరాత్రి 1 గంట తర్వాత సమాచారం అందిందని తెలిపారు. దీంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారని పేర్కొన్నారు. ‘‘శుక్రవారం అర్ధరాత్రి 1 గంట తర్వాత గోకుల్‌పురి పీఎస్ పరిధిలో అగ్ని ప్రమాదం సంభవించింది.. వెంటనే రెస్క్యూ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు.. అగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు కూడా వేగంగా స్పందించారు.. మూడు గంటల పాటు శ్రమించి శనివారం తెల్లవారుజాము 4 గంటలకు మంటలను అదుపులోకి తీసుకొచ్చాం’’ అని చెప్పారు. ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని, 60 గుడిసెలు కాలిబూడిదయ్యాయని ఆయన తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని, ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టామని డీసీపీ తెలియజేశారు. చనిపోయినవారిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు. పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించినట్టు వివరించారు. అటు, అగ్ని ప్రమాద ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు.


By March 12, 2022 at 09:53AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/7-dead-and-60-huts-burnt-in-major-fire-accident-in-gokulpuri-of-delhi/articleshow/90163687.cms

No comments