Breaking News

ఆర్ధిక సంక్షోభంతో అల్లాడుతున్న లంక: కిలో చికెన్ రూ.1,000.. కోడి గుడ్డు రూ.35


శ్రీలంక ఆర్థిక సంక్షోభంతొ అల్లాడుతోంది. రికార్డు స్థాయికి ద్రవ్యోల్బణం చేరుకోగా.. ధరలు ఆకాశాన్ని తాకాయి. పాలపొడి నుంచి లీటర్‌ పెట్రోల్‌ వరకు ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరాయి. నిత్యావసరాల కోసం కూడా ప్రజలు క్యూలు కట్టే పరిస్థితి ఏర్పడింది. పెట్రోల్‌ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరుతున్నారు. అక్కడ లీటర్‌ పెట్రోల్ ధర రూ. 283కు చేరుకోగా, డీజిల్‌ ధర రూ. 220కి చేరుకుంది. వంట గ్యాస్‌ సిలిండర్ ధర ఏకంగా రూ. 1,359 చేరుకుంది.

By March 21, 2022 at 10:38AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/commodities-skyrocketing-prices-leading-to-record-inflation-in-srilanka/articleshow/90346023.cms

No comments