Y.S.Jagan : ఏపీ సీఎం జగన్‌ను కలుస్తున్న చిరంజీవి మరియు ఇతర సినీ ప్రముఖులు
ఆంధ్ర ప్రదేశ్‌లో సినిమా టికెట్ల వివాదానికి ఎండ్ కార్డ్ పడేలా కనిపిస్తోంది. గురువారం , నాగార్జున సహా ప్రభాస్, మహేష్,ఎన్టీఆర్, రాజమౌళి, కొరటాల శివ సహా కొంత మంది సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌ను కలవబోతున్నారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్స్ ధరను నిర్ణయించడానికి ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సినీ పరిశ్రమకు చెందిన పలువురితో రెండు దఫాలు చర్చలు జరిపి ఓ నివేదికను తయారు చేసింది. ఈ నేపథ్యంలో ముఖ్య మంత్రి వై.ఎస్.జగన్‌ను కలవడానికి సినీ ప్రముఖులు వెళుతున్నారు. ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని.. వై.ఎస్.జగన్‌తో మీటింగ్‌కు కావాల్సిన ఏర్పాట్లను చేశారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకుని అక్కడ నుంచి తాడే పల్లి గూడెంలోని ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుకోబోతున్నారు. సినిమా టికెట్ ధరలతో పాటు సినీ పరిశ్రమకు చెందిన ఇతర సమస్యలు గురించి కూడా సినీ ప్రముఖులు సీంతో మాట్లాడే అవకాశం ఉందని సమాచారం. గత ఏడాదిన ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ రేట్స్‌ను బాగా తగ్గించిన సంగతి తెలిసిందే. దీనిపై సినీ పరిశ్రమ అప్పటి నుంచి అసంతృప్తితోనే ఉంది. పలు సందర్భాల్లో కొందరు ఏపీ ప్రభుత్వంపై విమర్శలు కూడా చేశారు. అయితే కొందరు మాత్రం చర్చల రూపంలో సమస్యకు పరిష్కారం తీసుకు రావాలని ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. సినిమా టికెట్స్ రేట్స్‌ను తగ్గించడంపై ఆర్జీవీ కూడా ఏపీ ప్రభుత్వ తీరుని విమర్శించిన సంగతి తెలిసిందే. సినిమా టికెట్ ధరలను మరి తగ్గించడం సమంజసం కాదంటూ రామ్ గోపాల్ వర్మ చేసిన వాదనలు ఆ మధ్య కాలంలో హాట్ టాపిక్‌గా మారాయి. దాంతో ఆయన్ని పేర్ని నాని ప్రత్యేకంగా పిలిచి మాట్లాడి, ఆయన అభిప్రాయాలను తీసుకున్నారు. తదనంతరం చిరంజీవి వెళ్లి ముఖ్యమంత్రి జగన్‌ను కలిశారు.
By February 10, 2022 at 07:11AM
No comments