Breaking News

Ukraine war Live Updates రష్యాతో పోరులో తొలి రోజు 137 మంది మృతి.. ఉక్రెయిన్ ప్రకటన


ఉక్రెయిన్‌పై రష్యా చేపట్టిన సైనిక చర్యను ‘దాడి’గా పిలవడానికి చైనా నిరాకరించింది. ఆ పదం వాడటం పక్షపాత వైఖరికి నిదర్శనమని ఆక్షేపించింది. అయితే, ఇరు దేశాలూ సంయమనం పాటించాలని, పరిస్థితులు మరింత దిగజారకుండా చూడాలని చైనా హితవు పలికింది. ఉక్రెయిన్‌ నాటో కూటమిలో చేరతానని పట్టుబట్టడమే ప్రస్తుత యుద్ధానికి కారణంగా మారింది. ఆ కూటమిలో ఉక్రెయిన్‌ చేర్చుకోమని హామీ ఇవ్వాలంటూ అమెరికా, నాటోపై తీవ్రమైన ఒత్తిడి పెంచుతోంది. తూర్పు ఐరోపాలో నాటో విస్తరణను ఆపేయాలని పుతిన్‌ బలంగా డిమాండ్‌ చేస్తున్నారు. దీనికి నాటో నుంచి లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని కోరుతున్నారు. 1997 ముందు నాటి స్థితికి నాటో దళాలు వెళ్లాలని చెబుతున్నారు. దీంతోపాటు గతంలో వార్సోపాక్ట్‌ ఒప్పందంలో భాగస్వాములైన 14 దేశాలకు నాటో సభ్యత్వం ఇవ్వడంపై కూడా అభ్యంతరం చెబుతున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో కనీసం 137 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉక్రెయిన్‌పై భూ, సముద్ర, వాయు మార్గాల ద్వారా దాడిచేసిన రష్యా.. సైనిక స్థావరాలను ధ్వంసం చేసింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో జరిగిన అతిపెద్ద దాడి ఇదే. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కంటే గొప్ప ఆశయాలను కలిగి ఉన్నారని అమెరికా పేర్కొంది. రష్యా అధ్యక్షుడికి ఫోన్ చేసిన భారత ప్రధాని నరేంద్ర మోదీ తక్షణమే దాడులను ఆపాలని సూచించింది. ‘‘తక్షణమే హింసకు స్వస్తి పలకండి. సమస్యపై దౌత్యపరమైన చర్చలకు మార్గం ఏర్పరిచేలా అన్ని వైపుల నుంచి ప్రయత్నాలు సాగించండి’’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కోరారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో మోదీ గురువారం పుతిన్‌కు ఫోన్‌ చేశారు. ఈ సందర్భంగా నాటో కూటమితో దీర్ఘకాలంగా ఉన్న విభేదాలను పరిష్కరించుకునేందుకు నిజాయతీతో కూడిన మార్గమే ఉత్తమని తెలిపినట్టు పీఎంఓ వెల్లడించింది.


By February 25, 2022 at 07:58AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/russia-ukraine-crisis-live-updates-over-100-dead-on-day-1-of-russia-invasion/articleshow/89814940.cms

No comments