Breaking News

Khiladi Pre Release Event : నేను అదృష్టాన్ని కాదు.. నా కష్టాన్ని నమ్ముతా : హీరో రవితేజ


మాస్ మహారాజా హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందిన భారీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘’.డింపుల్ హయతి, మీనాక్షి చౌద‌రి హీరోయిన్స్‌. బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించారు. ప్లే స్మార్ట్ అనేది ట్యాగ్ లైన్‌. హవీష్ ప్రొడక్షన్‌పై తెరకెక్కిన ఈ చిత్రానికి. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీత సార‌థ్యం వ‌హించారు. సెన్సార్ స‌హా అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని యు/ఎ స‌ర్టిఫికేట్ పొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 11న విడుదల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా బుధ‌వారం రాత్రి హైద‌రాబాద్‌లోని పార్క్ హ‌య‌త్ హోట‌ల్‌లో ఖిలాడీ ప్రీరిలీజ్‌వేడుక ఘ‌నంగా జ‌రిగింది. బిగ్ టిక్కెట్‌ను డైరెక్ట‌ర్‌ బాబీ ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా... మాస్ మ‌హారాజా ర‌వితేజ మాట్లాడుతూ ‘‘నేను జాత‌కాన్ని అదృష్టాన్ని న‌మ్మ‌ను. క‌ష్టాన్ని న‌మ్ముతా. అదృష్టం అనేది ఏదో ఒక‌శాతం మాత్ర‌మే ఉంటుంది. ఇక ఖిలాడి సినిమా విష‌యానికి వ‌స్తే ముందుగా మూవీని ఫిబ్రవరి 18న విడుదల చేయాలని అనుకున్నాం. కానీ పనులన్నీ త్వరగా పూర్తి కావడంతో ఫిబ్రవరి 11నే మీ ముందుకు తీసుకొస్తున్నాం. నిర్మాత కోనేరుసత్యనారాయణగారు మంచి నటీనటులనే కాదు టాప్ టెక్నీషియనన్స్‌ను కూడా డైరెక్ట‌ర్ ర‌మేష్ వ‌ర్మ‌కు అందించారు. ర‌మేష్ వ‌ర్మ మ‌హార్జాత‌కుడు. ఎందుకంటే సినిమా రిలీజ్‌కంటే ముందే నిర్మాత నుంచి కారుని గిఫ్ట్‌గా తీసుకున్నారు. రాక్ స్టార్‌తో కాస్త గ్యాప్ వ‌చ్చింది. కానీ.. ఇకపై ఈ గ్యాప్ రాదు. పాట‌ల‌న్నీ బ్యూటీఫుల్‌గా ఉన్నాయి. కిల్ కిల్ ఖిలాడి.. అనే సాంగ్ ఇందులో నా ఫేవ‌రేట్‌. రైట‌ర్ శ్రీకాంత్ విస్సాపై న‌మ్మ‌కంతో సినిమా చేశాను. అలాగే సినిమాటోగ్రాఫ‌ర్స్ సుజిత్ వాసుదేవ‌న్‌, జి.కె.విష్ణు అద్భుతంగా స‌న్నివేశాల‌ను చూపించారు. అన‌సూయ‌తో, అర్జున్‌గారితో తొలిసారి వ‌ర్క్ చేశాను. అర్జున్‌గారు ఇన్‌స్పైరింగ్ ప‌ర్స‌నాలిటీ. సినిమా చూస్తే ఆయ‌న పాత్ర ఎంత బాగా ఉంటుందో తెలుస్తుంది. ర‌వితేజ ఇందులో ద్విపాత్రాభిన‌యం చేశారు. మ‌నీ లాండ‌రింగ్ అనే పాయింట్ చుట్టూ తిరిగే క‌థాంశం. క్రాక్‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన త‌ర్వాత ర‌వితేజ చేస్తోన్న సినిమా ఇది. వీర త‌ర్వాత ర‌వితేజ‌, ర‌మేష్ వ‌ర్మ కాంబినేష‌న్‌లో రూపొందిన‌ చిత్ర‌మిది.


By February 09, 2022 at 11:21PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/hero-ravi-teja-speech-in-khiladi-pre-release-event/articleshow/89461696.cms

No comments