Breaking News

హిజాబ్ ధరించిన బాలిక ప్రధాని అవుతుంది.. ఆరోజు వస్తుంది: ఒవైసీ వీడియో వైరల్


కర్ణాటకలోని ఉడుపిలో గత నెలలో మొదలైన వివాదం.. దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల వేళ ఈ అంశం రాజకీయ పార్టీలకు ప్రచారాస్త్రంగా మారింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత సంచలన వ్యాఖ్యలు చేశారు. హిజాబ్‌ ధరించే బాలిక ఎప్పటికైనా భారతదేశ ప్రధానమంత్రి అవుతుందని ఆయన ట్వీట్‌ చేశారు. బాలికలు హిజాబ్‌ ధరించి తరగతులకు హాజరవడంపై కర్ణాటకలో వివాదం నెలకొన్న నేపథ్యంలో ఒవైసీ ఆదివారం ఓ వీడియోను ట్విటర్‌లో ఉంచారు. ‘ఒక అమ్మాయి హిజాబ్ ధరించాలని నిర్ణయించుకుంది.. తన తల్లిదండ్రులు అలా చేయమని కోరి.. దానిని ధరించడానికి అనుమతించినప్పుడు ఎవరు ఆపగలరో? మేము చూస్తాం..హిజాబ్‌ ధరించే బాలికలు కాలేజీలకు వెళ్తారు.. జిల్లా కలెక్టర్లు, మేజిస్ట్రేట్లు, డాక్టర్లు, వ్యాపారవేత్తలు అవుతారు.. అది చూడటానికి నేను బతికి ఉండకపోవచ్చు. కానీ నా మాటలు గుర్తుంచుకోండి.. హిజాబ్‌ ధరించిన బాలిక ఏదో ఒక రోజున ప్రధాని కూడా అవుతుంది’ అని ఒవైసీ పేర్కొన్నారు. కరోనా కారణంగా ప్రత్యక్ష తరగతులు నిర్వహించలేని ప్రభుత్వం మళ్లీ సవాళ్లను ఎదుర్కోనుంది. ఉడుపిలో చెలరేగిన హిజాబ్‌ వివాదం గుదిబండగా మారింది. ఈ వివాదం కారణంగా అంతర్జాతీయ స్థాయిలో కర్ణాటక పేరు మారుమోగుతోంది. కళాశాలలకు సెలవు ప్రకటించినా పాఠశాలల నిర్వహణ కూడా కష్టంగానే భావిస్తోంది. బెంగళూరుకూ హిజాబ్‌ వివాదం పాకటంతో సర్కారు అప్రమత్తమైంది. సోమవారం నుంచి ప్రారంభమయ్యే పాఠశాలలపై జిల్లాల పాలనాధికారులు, ఎస్పీలు నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై సూచించారు. ఈ నివేదిక ద్వారా విద్యా సంస్థల నిర్వహణపై తుది నిర్ణయం తీసుకుంటారు. హిజాబ్‌ వివాదం కేవలం ఉన్నత విద్యా సంస్థలకే పరిమితం కాలేదు. 6-10వ తరగతి విద్యార్థులు కూడా హిజాబ్‌లతో పాఠశాలలకు రావటం, కొన్ని చోట్ల నమాజ్‌లు చేస్తూ కలకలం సృష్టిస్తున్నారు.


By February 14, 2022 at 10:50AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/a-girl-in-hijab-will-be-indias-prime-minister-one-day-says-asaduddin-owaisi/articleshow/89559044.cms

No comments