Breaking News

మార్చి నాటికి థర్డ్ వేవ్ తగ్గుముఖం.. ఐసీఎంఆర్ ఏడీజీ


మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ్ బెంగాల్‌లో ఫిబ్రవరి చివరినాటికి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్) అడిషనల్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సమీరన్ పాండా అన్నారు. ఈ రాష్ట్రాల్లో థర్డ్ వేవ్ తీవ్రత గరిష్ఠానికి చేరిందని, ఈ నెలాఖరు నాటికి సాధారణ స్థితికి కేసులు చేరుకుంటాయని వ్యాఖ్యానించారు. అయితే, దేశవ్యాప్తంగా మాత్రం మార్చి నాటికి ఉద్ధృతి తగ్గుతుందని అంచనా వేస్తున్నామని ఏడీజీ పేర్కొన్నారు. ‘‘మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ్ బెంగాల్‌లో థర్డ్ వేవ్ తీవ్రత గరిష్ఠానికి చేరింది.. ఈ నెలాఖరు నాటికి సాధారణ స్థితికి కేసులు చేరుకుంటాయి. దేశవ్యాప్తంగా మాత్రం మార్చి నాటికి కోవిడ్-19 ఉద్ధృతి తగ్గుతుంది’’ అని ఆయన తెలిపారు. ఎపిడిమియాలజిస్ట్ డాక్టర్ చంద్రకాంత్ లోహరియా మాట్లాడుతూ.. వచ్చే మూడు నాలుగు వారాల్లో దేశంలో థర్డ్ వేవ్ ముగింపు దశకు చేరుకుంటుందని భావిస్తున్నామని అన్నారు. ప్రస్తుతం దేశంలో ఒమిక్రాన్ ఆధిపత్యం కొనసాగుతోందని తెలిపారు. దేశంలోని నమోదవుతున్న 90 శాతం ఒమిక్రాన్ ఉంటే కేవలం 10 శాతం మాత్రమే డెల్టా వేరియంట్ కేసులున్నాయని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కేసుల పెరగడం, తగ్గుదలలో ఇదే తీరు కొనసాగుతోందన్నారు. మ్యాథమెటికల్ మోడల్ ఆధారంగా అంచనా వేసిన ఐసీఎంఆర్.. ఈ మూడు రాష్ట్రాల్లో కేసుల గరిష్ఠం, పతనం ఈ నెలలోనే ఉంటుందని పేర్కొంది. , ఇంపీరియల్ కాలేజ్ లండన్ అభివృద్ధి చేసిన క్రోమిక్ మోడల్ ప్రకారం మార్చి మధ్య నాటికి దేశంలో కోవిడ్ స్థానిక దశకు చేరుకోవచ్చని అంచనా వేసింది. ‘‘SARS-CoV-2 వేరియంట్స్ ఆందోళనకు సంబంధించిన కొత్తవి భవిష్యత్తులో ఉద్భవించకపోతే పరిస్థితి నియంత్రణలోకి రావచ్చు.. అంటువ్యాధి నుంచి స్థానిక దశకు మహమ్మారి మార్పు చెందుతుంది’’ అని డాక్టర్ పాండా చెప్పారు. జనవరి తొలినాళ్లలో కేసులు పెద్ద సంఖ్యలో బయటపడ్డాయని, తర్వాత నుంచి క్రమంగా తగ్గుతున్నాయని సమీర్ పాండా అన్నారు. ఈ తీవ్రత ఫిబ్రవరి చివరి నాటికి తగ్గే సూచనలు ఉన్నాయని పేర్కొన్నారు. మహారాష్ట్రలో కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం వెల్లడించింది. అలాగే, మిగతా రాష్ట్రాల్లోనూ కేసుల్లో తగ్గుదల కనిపిస్తున్నట్టు తెలిపింది.


By February 05, 2022 at 07:48AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/third-wave-expected-to-ebb-by-march-in-country-say-icmr-adg/articleshow/89358581.cms

No comments