Breaking News

అదంతా ఫేక్! ఇక ఆపండి.. పవన్ కళ్యాణ్ ఫొటోతో బాబు గోగినేని కీలక వ్యాఖ్యలు


ఏపీ రాజకీయాల్లో కీలకంగా ఉంటూనే సినిమాల్లో భాగమవుతున్నారు . పార్టీతో ముందుకెళ్తూ రాజకీయ ప్రయాణం చేస్తున్న ఆయనను సామాజికవేత్త, హేతువాది సపోర్ట్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో 2019 సంవత్సరం నుంచి వైరల్ అవుతున్న ఓ ప్రమోషనల్ ఫొటోని తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేసిన బాబు గోగినేని.. ఇది ఫేక్ అని, తాను ఎవ్వరినీ సపోర్ట్ చేయడం లేదని పేర్కొన్నారు. 'రాజకీయం అంటే ప్రజల ఓట్ల కోసం కాదు ప్రజల బాగు కోసం అని వాళ్ళతో నిలబడి సమస్యలని సాల్వ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తిని మనం ఆహ్వానించాలి' అని బాబు గోగినేని చెప్పినట్లుగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఆ ప్రమోషనల్ ఫొటోపై రాసి ఉంది. అయితే అదే ఫొటోని తన ఫేస్ బుక్‌లో పోస్ట్ చేసిన బాబు గోగినేని.. 'నేను అలా చెప్పలేదు.. అది ఫేక్' అని తెలుపుతూ ఇలాంటి తప్పుడు ప్రమోషన్స్ చేయడం సరికాదంటూ మండిపడ్డారు. ''నేను ఇప్పటివరకు ఏ రాజకీయవేత్తను సపోర్ట్ చేయలేదు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్‌ని నేను పొగిడినట్లు రాసింది నిజం కాదు. ఈ ఫొటో కాపీస్ ఫేస్ బుక్, వ్వాట్సాప్ లాంటి సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇది చాలా అవమానకరం. పవన్ కళ్యాణ్ రాజకీయాలను ప్రచారం చేయడానికి నా పేరు వాడుకోవడం చాలా తప్పు. ఓటర్లు సొంతంగా చైతన్యవంతం కావాలి, సరైన నిర్ణయం తీసుకోవాలి. నాకు రాజకీయాలు తెలియదని కాదు కానీ ఎప్పుడూ నా దృష్టి మొత్తం మానవతావాదం, హేతువాదంపైనే ఉంటుంది. నేను వికేంద్రీకృత, వ్యవస్థీకృత రాజకీయాల కోసం నిలబడతాను తప్ప ఏ పార్టీని ఎంకరేజ్ చేయను. మన ప్రజాస్వామ్యంలో మానవ హక్కులు, సామాజిక సంస్కరణ చాలా ప్రధానమైనవి. లౌకికవాదం ఎంతో అవసరం. శాస్త్రీయ దృక్పథాన్ని ప్రోత్సహిస్తూ ఉద్యోగాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం ముఖ్యమైన అంశం. కుల వ్యవస్థను రూపుమాపాలి. లింగ వివక్ష ఎక్కడా ఉండకూడదు. కుల రాజకీయాలు ఉండొద్దు. ఆధునిక శాస్త్రీయ విద్య, ఆరోగ్యంపై అత్యధిక బడ్జెట్ కేటాయింపులు జరగాలి. అవినీతి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించాలి. నేను పవన్ కళ్యాణ్‌ని సపోర్ట్ చేయడం పక్కనబెడితే.. ఆయన రాజకీయ ప్రయాణం, సామాజిక జీవితంలో ఈ ముఖ్యమైన సూత్రాలను పవన్ కళ్యాణ్ సమర్థిస్తారా? అనేది ఇక్కడ ప్రశ్న. పవన్ కళ్యాణ్ మద్దతు దారులు, జనసేన పార్టీ వర్గాలు, పొలిటికల్ సేనలు ఇకపై సామజిక మాధ్యమాల్లో నేను పవన్ కళ్యాణ్‌ని సపోర్ట్ చేసినట్లు వస్తున్న కల్పిత ప్రచారాలను ఆపేయండి'' అని పేర్కొన్నారు బాబు గోగినేని. దీంతో ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.


By February 20, 2022 at 12:11PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/babu-gogineni-comments-on-fake-promotions-of-pawan-kalyan-team/articleshow/89699714.cms

No comments