Breaking News

ఉక్రెయిన్‌‌లో కొనసాగుతోన్న భీకర పోరు… బాంబుల మోతలు


ఉక్రెయిన్ పేలుళ్లలతో దద్దరిల్లుతోంది. ఎటు చూసినా బాంబుల మోతలు, సైరన్ కూతలతో భయానక పరిస్థితి ఏర్పడింది.నలువైపులా రష్యన్ సేనలు మోహరిస్తున్నాయి. అదే సమయంలో ఉక్రెయిన్ బలగాలు ప్రతిఘటిస్తున్నాయి. కీవ్‌ నగరంపై పట్టు కోసం రష్యన్‌ సైనికులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఆ ప్రయత్నాలను ఉక్రెయిన్ సేన అంతే ధీటుగా తిప్పికొడుతోంది. ప్రస్తుతం వీధుల్లో కూడా రష్యా సేనలు, ఉక్రెయిన్ బలగాలు మధ్య పోరాటం సాగుతోంది. కీవ్‌ నగరం నడిబొడ్డుకు 30 కిలోమీటర్ల దూరంలో మోహరించి ఉన్నాయి. ఆదివారం తెల్లవారుజామున వాసిల్కివ్‌లోని కీవ్‌కు దక్షిణంగా రెండుసార్లు పేలుళ్లు సంభవించాయి. అక్కడ హోరాహోరీగా పోరు కొనసాగుతోంది. దీంతో కీవ్‌లో హై అలర్ట్‌ సాగుతోంది. ఈ క్రమంలో పారాట్రూపర్లతో వెళ్తున్న రష్యా రవాణా విమానాన్ని వసిల్‌కీవ్‌ సమీపంలో కూల్చివేశామని ఉక్రెయిన్‌ సైన్యం ప్రకటించింది. కీవ్‌కు 85 కిలోమీటర్ల దూరంలో మరో రవాణా విమానాన్ని కూల్చివేసినట్టు తెలిపింది. ఈ విషయాన్ని అమెరికా నిఘా విభాగ అధికారి కూడా ధ్రువీకరించారు. కాగా రష్యా దాడుల్లో 198 మంది మరణించారని, వెయ్యి మందికిపైగా గాయపడ్డారని ఉక్రెయిన్ ఆరోగ్య మంత్రి వెల్లడించారు. అయితే ఎన్ని ప్రాంతాలు రష్యా చేతికి చిక్కాయన్న సమాచారంపై స్పష్టత కొరవడింది. కాగా ఎన్ని ఆంక్షలు పెట్టినా వెనక్కి తగ్గేదలే లేదని రష్యా ఇప్పటికే ప్రకటించింది. అదే సమయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కూడా ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. తమ నేలను వదిలేదే లేదని తేల్చి చెప్పారు. లొంగిపోయే ప్రసక్తి లేదని, పోరాడి చూపిస్తామని ప్రకటించారు.


By February 27, 2022 at 09:37AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/high-alert-as-russia-closes-in-on-all-sides-in-kyiv-of-ukraine/articleshow/89863134.cms

No comments