Breaking News

ఒమిక్రాన్ కంటే ‘ఓ మిత్రోన్’ చాలా డేంజర్.. మోదీపై శశిథరూర్ సెటైర్లు


ఆంగ్లంలో కొత్త కొత్త పదాలను ప్రయోగిస్తూ ప్రత్యేకతను చాటుకునే కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ .. తాజాగా తన పదజాలంతో ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శనాస్త్రాన్ని సంధించారు. ప్రధాని తరుచుగా వాడే పదంతోనే ఆయనను విమర్శించడం గమనార్హం. ప్రధాని తన ప్రసంగంలో తరచుగా వాడే మిత్రోన్‌ (O ) అనే పదాన్ని ప్రస్తావించిన శశిథరూర్‌.. అది ఒమిక్రాన్‌ () కంటే ప్రమాదకరమైందని ధ్వజమెత్తారు. గతకొన్ని రోజులుగా బీజేపీ విమర్శలు గుప్పిస్తున్న శశిథరూర్.. తాజాగా మోదీ వాడుక పదాన్ని వైరస్‌తో పోల్చుతూ ప్రభుత్వం తీరుపై విరుచుకుపడ్డారు. ‘ఒమిక్రాన్‌ కంటే ఓ మిత్రోన్‌ (O Mitron) అత్యంత ప్రమాదకరమైంది.. దాని పర్యవసానాలు మనం నిత్యం చూస్తూనే ఉన్నాం.. విభజనవాదం, ద్వేషం, మతోన్మాదాన్ని ప్రోత్సహించడం, రాజ్యాంగంపై పరోక్ష దాడులు, ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేయడం వంటివి గమనిస్తూనే ఉన్నాం.. ఈ వైరస్‌లో మాత్రం తక్కువ తీవ్రత కలిగిన వేరియంట్‌ లేదు’ అంటూ శశిథరూర్‌ విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలపై బీజేపీ అధికార ప్రతినిధి షెజాద్ పూనావాలా స్పందిస్తూ.. దేశంలో కరోనాతో నెలకొన్న పరిస్థితుల తీవ్రతను తగ్గించే ప్రయత్నమేనని ఎదురుదాడి చేశారు. గతంలో టీకాలపై సందేహాలు కలిగించిన కాంగ్రెస్‌ పార్టీ.. ఇప్పుడు ఒమిక్రాన్‌ తీవ్రతను తక్కువ చేసి చూపిస్తోందని విమర్శించారు. అంతకుముందు యూపీ మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌ సైతం కొవిడ్‌ కంటే సీఏఏ ప్రమాదకరమంటూ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ.. ఈ వ్యక్తులకు బాధ్యత లేదా? అంటూ నిలదీశారు. గతకొన్ని రోజులుగా బీజేపీ సహా ఆ పార్టీ నేతలపై శశిథరూర్‌ విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఇటీవల యోగీ ఆదిత్యనాథ్‌ ప్రసంగానికి సంబంధించిన ఓ వీడియోను ట్విటర్‌లో ఆయన షేర్‌ చేస్తూ.. తన మాటల ద్వారా దేశానికి ఎంత చేటు చేశారో యూపీ సీఎంకు తెలియడం లేదని దుయ్యబట్టారు. అలాగే, కాంగ్రెస్ నేతలను బీజేపీలో చేర్చుకోవడంపై కూడా తనదైన శైలిలో పంచ్‌లు వేశారు. బీజేపీ అంతా కాంగ్రెస్‌ నేతలతో నిండిపోతుందని, కాంగ్రెస్‌యుక్త బీజేపీగా మారిపోతోందని ఆయన సెటైర్లు వేశారు. ‘‘తమ ఇంటిని వదిలేసి వెళ్తున్నారు. బహుశా వారికి ఇంకేవో కలలు ఉండి ఉంటాయి. అయితే ఇప్పుడు అక్కడ కూడా అంతా అలాగే ఉంది. అక్కడ కూడా అందరూ మనవారే ఉన్నారు.. కాంగ్రెస్‌యుక్త్ బీజేపీ’’ అని ట్విట్టర్‌లో రాసుకొచ్చారు.


By February 01, 2022 at 07:44AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/congress-leader-shashi-tharoor-says-mitron-much-more-dangerous-than-omicron/articleshow/89260632.cms

No comments