Breaking News

Bheemla Nayak : వ‌ర్మ కోరిక తీరుస్తోన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..ఇప్పుడు మ‌రి ఆర్జీవీ ఏమంటాడో..!


రామ్ గోపాల్ వ‌ర్మ కోరిక‌ను ప‌వ‌న్ క‌ళ్యాణ్ తీర్చ‌బోతున్నార‌ట‌. అస‌లు ఇంత‌కీ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ఆర్జీవీ ఎప్పుడు కోరిక కోరారు? ఏమ‌ని కోరారు? దానికి ఆయ‌న ఇచ్చిన రియాక్ష‌న్ ఏంటి? అనే వివ‌రాల‌ను తెలుసుకోవాలంటే, కొన్ని రోజులు ముందుకు వెళ్లాల్సిందే. ఇటీవ‌ల కాలంలో వివాదాస్ప‌ద దర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ త‌న ట్విట్ట‌ర్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ భీమ్లా నాయ‌క్‌.. అల్లు అర్జున్ పుష్ప గురించి ట్వీట్స్‌తో రెచ్చిపోయారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానిగా బాధ‌ప‌డుతున్నాన‌ని వ‌ర్మ తెలిపారు. అందుకు కార‌ణం, ఆయ‌న భీమ్లా నాయ‌క్‌ను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయాల‌ని కోరారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న‌ను తాను పాన్ ఇండియా హీరోగా నిరూపించుకోక‌పోతే, ఆయ‌న అభిమానులుగా తాము అల్లు అర్జున్ అభిమానులకు స‌మాధానం చెప్పుకోలేక పోతున్నామ‌ని ఆర్జీవీ తెలిపారు. అంతే కాదండోయ్‌, ఆయ‌న కంటే వెనుక ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన తార‌క్‌, రామ్ చ‌ర‌ణ్ వంటి వారు పాన్ ఇండియా హీరోల‌వుతున్నార‌ని.. కాబ‌ట్టి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా పాన్ ఇండియా కావాల‌ని కోరారు. ప‌వ‌న్ ఇప్పుడు రిలీజ్‌కి సిద్ధం చేస్తోన్న భీమ్లా నాయ‌క్‌ను పాన్ ఇండియా రేంజ్‌లో విడుద‌ల చేసి త‌న సత్తాను ప్రూవ్ చేయాల‌ని కోరారు. ఇది జ‌రిగి కొన్ని రోజులే అవుతుంది. అయితే ఇప్పుడు రామ్ గోపాల్ వ‌ర్మ కోరిక నేర‌వేరుతుంది. ఎందుకంటే భీమ్లా నాయ‌క్ సినిమాను హిందీలోనూ విడుద‌ల చేయ‌బోతున్నార‌ట‌. ప‌వ‌న్ చేసిన భీమ్లా నాయ‌క్‌ను హిందీలో విడుద‌ల చేయబోతున్నామ‌ని చిత్ర నిర్మాత సూర్య దేవ‌ర నాగ‌వంశీ రీసెంట్ ఇంట‌ర్వ్యూలో తెలిపారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్, రానా ద‌గ్గుబాటి హీరోలుగా న‌టిస్తోన్న చిత్రం ‘భీమ్లా నాయ‌క్‌’ ఈ నెల 25 లేదా ఏప్రిల్ 1న కానీ విడుద‌ల‌వుతుంద‌ని నిర్మాత‌లు తెలిపారు. సినీ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు శివ‌రాత్రి సంద‌ర్భంగా ఫిబ్ర‌వ‌రి 25నే మూవీ విడుద‌ల‌య్యే అవ‌కాశాలున్నాయ‌ట‌. సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ చిత్రానికి త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ మాట‌లు, స్క్రీన్ ప్లే అందించ‌టంతో పాటు ఓ పాట‌ను రాశారు. సితార ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య దేవ‌ర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


By February 11, 2022 at 11:28PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/as-per-ram-gopal-varma-wish-bheemla-nayak-going-to-release-in-hindi-also/articleshow/89511734.cms

No comments