Breaking News

Andhra Pradesh Restrictions : ‘భీమ్లా నాయ‌క్‌’ వ‌ర్సెస్ ఏపీ ప్ర‌భుత్వం.. ఆంక్ష‌లు షురూ!


ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘భీమ్లా నాయ‌క్‌’. మ‌రో హీరో రానా ద‌గ్గుబాటి.. డానియ‌ల్ శేఖ‌ర్ అనే పాత్ర‌లో న‌టించారు. శివ‌రాత్రి సంద‌ర్భంగా సినిమా ఫిబ్ర‌వ‌రి 25న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల‌వుతుంది. ‘భీమ్లా నాయ‌క్‌’ రిలీజ్‌కి ఏపీ ప్ర‌భుత్వం ఆంక్ష‌ల‌ను మ‌రోసారి థియేట‌ర్స్ య‌జ‌మానుల‌కు గుర్తు చేసింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎక్క‌డా స్పెష‌ల్ షో వేయ‌కూడ‌ద‌ని ఆదేశాలు జారీ చేసింది. అలా వేస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలియ‌జేసింది. అలాగే టికెట్ రేట్స్ కూడా ప్ర‌భుత్వం విధించిన ధ‌ర‌ల‌ ప‌రిమితిలోపే ఉండాల‌ని పేర్కొంది. ‘భీమ్లా నాయ‌క్‌’ సినిమాకు సంబంధించి స్పెష‌ల్ షోస్‌, టికెట్ ధ‌ర‌లు త‌దిత‌ర అంశాల‌పై ప్ర‌త్యేక‌మై దృష్టి పెట్టాల‌ని రెవెన్యూ శాఖ‌కు ఆదేశాల‌ను జారీ చేసింది ఏపీ ప్ర‌భుత్వం. నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘిస్తే 1952 సినిమాటోగ్ర‌ఫీ చ‌ట్టం ద్వారా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలియ‌జేస్తూ త‌హ‌సీల్దారులు వారి ప‌రిధిలోని సినిమా థియేట‌ర్స్‌కు నోటీసులు పంపించారు. అదే స‌మ‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వం మాత్రం ‘భీమ్లా నాయ‌క్‌’ సినిమాకు ఐదో ఆట‌కు ప్ర‌త్యేక‌మైన అనుమ‌తిని ఇచ్చింది. ఫిబ్ర‌వ‌రి 25 నుంచి మార్చి 11 వ‌ర‌కు ప్ర‌తి థియేట‌ర్‌లోనూ ఐదో ఆట‌ను ప్ర‌ద‌ర్శించుకోవ‌చ్చున‌ని కేసీఆర్ ప్ర‌భుత్వం ఆదేశాల‌ను ఇవ్వ‌డంపై ప‌వ‌ర్ స్టార్ ఫ్యాన్స్ సంతోషాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. మ‌ల‌యాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’కు ఇది రీమేక్. నిజాయ‌తీ గ‌ల పోలీస్ ఆఫీస‌ర్‌కి, రాజ‌కీయ నాయ‌కుడిగా ఎద‌గాల‌నుకునే మ‌రో వ్య‌క్తికి జ‌రిగే పోరాట‌మే ‘భీమ్లా నాయ‌క్‌’. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో సూర్య దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు, రైట‌ర్ త్రివిక్ర‌మ్ ఈ చిత్రానికి మాట‌లు, స్క్రీన్ ప్లేతో పాటు ఓ పాట‌ను కూడా రాశారు.


By February 24, 2022 at 08:49AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/andhra-pradesh-government-restrictions-on-pawan-kalyan-bheemla-nayak-movie/articleshow/89788710.cms

No comments