Breaking News

ఘోర విషాదం: బంగారు గని సమీపంలో పేలుడు.. 59 మంది మృతి


పశ్చిమ ఆఫ్రికా దేశం బుర్కినాఫెసోలో విషాదం చోటుచేసుకుంది. సమీపంలో భారీ పేలుడు సంభవించి.. 59 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మందికిపైగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నైరుతి బుర్కినాఫెసోలోని బాంబ్లోరా గ్రామం వద్ద ఉన్న ఈ ప్రమాదం జరిగినట్టు పేర్కొన్నారు. ఈ పేలుడుకు బంగారాన్ని శుద్ధి చేసే రసాయాలే కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. పేలుడు తర్వాత అక్కడ పరిస్థితి భయానకంగా ఉందని, శరీర భాగాలు తునాతునకలై మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయని ఓ అధికారి తెలిపారు. కాగా, ఆఫ్రికాలో బంగారం ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో ఐదో స్థానంలో ఉంది. ఆఫ్రికాలో బంగారం ఉత్పత్తి అత్యంత వేగంగా ఉన్న దేశం ఇదే కావడం గమనార్హం. ఈ రంగంలో 2019 నాటికి 1.5 మిలియన్ల మంది ఉపాధి పొందుతుండగా.. 2 బిలియన్ డాలర్లు ఆదాయం పొందుతోంది. బాంబ్లోరా వంటి చిన్ని చిన్న బంగారు గనులు ఇటీవల కాలంలో అక్కడ వేగంగా విస్తరిస్తున్నాయి. ఆ దేశవ్యాప్తంగా ఇటువంటి మొత్తం 800 వరకూ ఉన్నాయి. అనధికారిక గనుల ద్వారా సేకరించిన బంగారాన్ని పొరుగున ఉన్న టోగో, బెనిన్, నైజర్, ఘనా వంటి దేశాలకు అక్రమంగా తరలిస్తున్నట్టు దక్షిణాఫ్రికాకు చెందిన సెక్యూరిటీ స్టడీస్ తెలిపింది. అల్-ఖైదా, ఇస్లామిక్ స్టేట్‌తో సంబంధం ఉన్న జిహాదీలు కూడా 2016 నుంచి చిన్న తరహా గనులను ఉపయోగిస్తున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. మైనార్టీ వర్గాలపై పన్ను విధించడం ద్వారా ఉగ్రవాద గూపులు నిధులను సేకరిస్తాయి. ఉగ్రవాదంలో రిక్రూట్ చేయడానికి గనుల్లోని ప్రాంతాలను ఉపయోగించుకుంటాయి. చిన్న తరహా గనుల్లో నిబంధనలను పాటించకపోవడం వల్ల మరింత ప్రమాదకరంగా మారాయని మైనింగ్ నిపుణులు అంటున్నారు. ‘‘చిన్న-స్థాయి మైనింగ్ రంగం విషయంలో పరిమిత నియంత్రణ చాలా ప్రమాదకరమైంది.. ప్రమాదాలను పెంచడానికి దోహదం చేస్తుంది.. పేలుడు పదార్థాల వాడకంతో సహా దేశంలోకి తరచుగా అక్రమంగా రవాణా.. చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు ఉపయోగించే ప్రమాదం ఉంది’’ అని స్విట్జర్లాండ్‌కు చెందిన అంతర్జాతీయ సీనియర్ విశ్లేషకుడు మార్సెనా హంటర్ అన్నారు.


By February 22, 2022 at 09:04AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/more-than-59-killed-and-hundres-injured-in-gold-mining-site-blast-in-burkina-faso/articleshow/89738924.cms

No comments