కోవిడ్ కేసుల్లో స్వల్ప పెరుగుదల.. కొత్తగా 30 వేల కేసులు నమోదు, 2.45 శాతం పాజిటివిటీ రేటు
దేశంలో కొత్తగా 30,615 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అయితే మంగళవారం 27 వేల కేసులు నమోదవగా, గడచిన 24 గంటల్లో కేసుల సంఖ్యలో స్వల్ప పెరుగుదల కనిపించింది. దేశంలో 3,70,240 యాక్టివ్ కేసులున్నాయి. ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ రేటు 2.45 శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 3.32 శాతం ఉన్నట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 82,988 మంది రోగులు కొత్తగా కరోనా నుంచి కోలుకున్నారు. కరోనాతో 514 మంది చనిపోయారు. ప్రప్రస్తుతం పాజిటివ్ కేసుల సంఖ్య 4,27,23,558కి చేరుకోగా, కోవిడ్‌తో చనిపోయినవారి సంఖ్య 5,09,872కి చేరింది. మొత్తం బాధితుల్లో 4,18,43,446 మంది కోలుకోగా, 3,70,240 మంది చికిత్స తీసుకుంటున్నారు. దేశంలో రికవరీ రేటు 97.94 శాతంగా ఉంది. ఇక రాష్ట్రాల వారీగా కూడా కోవిడ్ కేసులు గణనీయంగా తగ్గాయి. అత్యధికంగా నమోదయ్యే ఢిల్లీ, మహారాష్ట్రాల్లోనూ అతి తక్కువగా కేసులు బయటపడుతున్నాయి. ఢిల్లీలో కేవలం కోవిడ్ కేసులు తగ్గాయి. అక్కడ కొత్తగా కేవలం 756 కేసులు మాత్రమే వెలుగు చూశాయి. అలాగే మహారాష్ట్రలో 2,831 మంది కొత్తగా కరోనా బారినపడ్డారు. కేరళలోని కొత్తగా 11,776 మంది కోవిడ్ బారినపడ్డారు. మరో 304 మంది చనిపోయారు. ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 64,28,148కు చేరింది. కర్ణాటకలో కూడా వైరస్ ఉద్ధృతి తగ్గింది. రాష్ట్రంలో తాజాగా 1,405 మంది కొవిడ్ బారిన పడ్డారు. మరో 26 మంది వైరస్తో ప్రాణాలు కోల్పోయారు.
By February 16, 2022 at 10:02AM
No comments