Breaking News

Thire Wave 3 రెట్లు పెరిగిన కేసులు.. దేశంలో కరోనా మొదలైన తర్వాత ఇదే అత్యధికం!


దేశంలో రోజువారీ కేసుల పెరుగుదల చూస్తే థర్డ్ వేవ్‌ మొదలయ్యిందనే సంకేతాలు వెలువడుతున్నాయి. గతవారం పాజిటివ్ కేసుల్లో పెరుగుదలే ఇందుకు నిదర్శనం. ముందువారంతో పోల్చితే గత వారం రోజువారీ కేసుల్లో మూడు రెట్లు పెరుగుదల నమోదయ్యింది. కేవలం వారం రోజుల్లోనే 181 శాతం మేర కేసులు పెరిగియాంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. డిసెంబరు 27 నుంచి జనవరి 2 మధ్య దేశవ్యాప్తంగా 1.2 లక్షల కొత్త కేసులు నిర్ధారణ కాగా.. 12 వారాల గరిష్ఠానికి చేరుకున్నాయి. డిసెంబరు 27కు ముందు వారం దేశంలో 46,073 కేసులు నమోదుకాగా.. 2020 మే మధ్య ఈ సంఖ్యలో కేసులు బయటపడ్డాయి. దేశంలో కరోనా వైరస్ మొదలైన తర్వాత ఇంత వేగంగా కేసులు ఇలా పెరగడం ఇదే తొలిసారి. 2021 ఏప్రిల్ 5 నుంచి 11 మధ్య సెకెండ్ వేవ్‌లో అత్యధికంగా 71 శాతం మేర కేసుల్లో పెరుగుదల నమోదయ్యింది. ఆదివారం దేశవ్యాప్తంగా కొత్తగా దాదాపు 34 వేల మంది వైరస్ బారినపడ్డారు. ముందు రోజుతో పోల్చితే ఇది 21 శాతం అధికం. ముందు అదివారంతో పోల్చితే జనవరి 2న దేశంలోని పాజిటివ్ కేసుల్లో ఐదు రెట్ల పెరుగుదల నమోదయ్యింది. సుమారు మూడు నెలల తర్వాత దేశంలో గతవారం కరోనా కేసులు లక్షలకుపైగా నిర్దారణ అయ్యాయి. అంతకు ముందు వారంతో పోల్చితే గతవారం అత్యధికంగా మహారాష్ట్రలో 41,980 మంది వైరస్ బారినపడ్డారు. కిందటి వారంతో పోల్చితే (8,292) ఇది ఐదు రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. ఆదివారం అక్కడ ఏకంగా 11,877 మందికి వైరస్ సోకింది. బిహార్‌లో 12 రెట్లు, బెంగాల్‌లో ఐదు రెట్లు, ఢిల్లీలో 9 రెట్లు మేర పాజిటివ్ కేసుల్లో పెరుగుదల నమోదయ్యింది. మిగతా రాష్ట్రాల్లోనూ రోజువారీ కేసులు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకుగానూ 30 చోట్ల వారాంతపు కేసులు పెరగడం గమనార్హం. మరోవైపు, ఒమిక్రాన్‌ వేరియంట్‌ వేగంగా వ్యాపించగలదని, దానివల్ల కేసులు భారీగా పెరిగితే ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై భరించలేనంత భారం పడే ముప్పు ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ హెచ్చరించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేలా వైద్య యంత్రాంగాలను సమాయత్తం చేసుకోవాలని రాష్ట్రాలకు ఆయన సూచించారు. 15-18 ఏళ్ల వారికి వ్యాక్సినేషన్‌పై ఆదివారం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్యశాఖ మంత్రులు, ముఖ్య కార్యదర్శులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పిల్లలకు వ్యాక్సినేషన్‌ సోమవారం నుంచి ప్రారంభమవనున్న నేపథ్యంలో టీకా కేంద్రాల నిర్వహణలో అప్రమత్తతతో వ్యవహరించాలని రాష్ట్రాలు, యూటీలకు మన్‌సుఖ్‌ మాండవీయ సూచించారు. పిల్లలకు కేవలం ‘కొవాగ్జిన్’ ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో.. వాటిలో ఇతర టీకాలు కలిసిపోకుండా ఏర్పాట్లు చేసుకోవాలని నిర్దేశించారు.


By January 03, 2022 at 06:54AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-weekly-covid-cases-up-nearly-3-fold-in-highest-ever-surge/articleshow/88656217.cms

No comments