Breaking News

Ravi Teja: రవితేజని కొట్టిన బాలకృష్ణ.. ఆ హీరోయిన్ కోసం గొడవ నిజమేనా.. అసలేమైంది?


నందమూరి చాలా ముక్కుసూటి మనిషి. చిన్నపిల్లాడి మనస్తత్వం.. ఎలాంటి మాస్క్‌లు లేకుండా ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడేస్తారు. మంచి అయినా చెడు అయినా ఆన్ ది స్పాట్ రియాక్షన్ ఉంటుంది. అంతేతప్ప కవర్ కోటింగ్‌లు బాలయ్య దగ్గర ఉండవు అనేది ఆయన్ని బాగా దగ్గర నుంచి చూసిన వాళ్లు చెప్పే మాట. నచ్చితే గుండెల్లో పెట్టుకుంటారు.. నచ్చకపోతే చెంపలు వాయించేస్తారు. చివరికి ప్రాణం ప్రేమించే అభిమానులైతే హద్దులు దాటితే దవడపగిలిపోవాల్సిందే. ఇదే ఆయన సూత్రం. బాలకృష్ణ కొడతారు అనేది అందరికీ తెలిసిన విషయమే.. సెట్స్‌లోనూ అలాగే బయట జనం మధ్యకి వచ్చినప్పుడు బాలయ్య కొట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే బాలయ్య కొట్టిన వాళ్ల లిస్ట్‌లో సామాన్యులే కాదు.. స్టార్ హీరోలు కూడా ఉన్నారా? హీరో రవితేజను కూడా బాలకృష్ణ కొట్టారా? ఓ హీరోయిన్ విషయంలో బాలకృష్ణ.. రవితేజపై చేయి చేసుకున్నారనే రూమర్ ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉంది. దానికి సంబంధించిన రకరకాల కారణాలు చెప్తూ ఉంటారు.. ఫిల్మ్ జర్నలిస్ట్‌లు కూడా నిప్పులేనిదే పొగరాదుగా.. కొట్టే ఉంటారులే అని ఈ రూమర్‌కి పొగ ఊదుతూ వచ్చారు. అయితే ఇటీవల బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ‘అన్ స్టాపబుల్’ టాక్‌ షోకి గెస్ట్‌గా వచ్చారు . ఈ కార్యక్రమంలో ఈ ఇష్యూపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇంతకీ బాలయ్య రవితేజను కొట్టిన మాట నిజమేనా? అంటే దానిపై క్లారిటీ ఇచ్చారు ‘అన్ స్టాపబుల్’ టాక్‌ షో రైటర్ బీవీఎస్ రవి.. అలియాస్ మచ్చా రవి. ప్రముఖ సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ప్రభుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న బీవీఎస్ రవి.. బాలకృష్ణ రవితేజను కొట్టారనే రూమర్లను ఖండిస్తూ వివరణ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. రవితేజ‌ గారితో చేసిన ‘అన్ స్టాపబుల్’ ఎపిసోడ్ చాలా ఇంట్రస్టింగ్. రవితేజ గారికి బాలకృష్ణ గారికి పడదని వాళ్లిద్దరూ కొట్టుకున్నారని బయట టాక్ ఉంది. బాలకృష్ణ గారు రవితేజ కొట్టారనే దానిపై షోలో క్లారిటీ ఇచ్చాం. నేను రవితేజ గారితో నేను గత 20 ఏళ్లుగా జర్నీ చేస్తున్నా.. మేం ఇద్దరం రోజు విడిచి రోజైనా మాట్లాడుకుంటాం.. మా ఇద్దరికీ అంతా చనువు ఉంది. అంత క్లోజ్‌గా ఉన్న నాకే ఈ విషయం తెలియలేదంటే బాలకృష్ణ గారు రవితేజని కొట్టింది నిజం కాదని అర్ధం. బాలకృష్ణ గారిని రవితేజ చాలాసార్లు కలిశారు. కలిసి మాట్లాడుకున్న సందర్భాలు.. ఎంజాయ్ చేసిన ఈవెంట్లు చాలా ఉన్నాయి. నిజంగా బాలకృష్ణ గారు రవితేజ కొడితే ఇవన్నీ జరిగేవా? ఎంత స్నేహం అయినా రిలేషన్ అయినా పింగానీ బొమ్మలాంటిది కిందపడితే పగిలిపోతుంది.. తిరిగి అతికించవచ్చు కానీ ఆ గీత అలాగే ఉండిపోతుంది. వాళ్లిద్దరి మధ్య ఎలాంటి గీత లేదు అనడానికి సాక్ష్యమే ఆ ఎపిసోడ్. మేం రవితేజని మేం ఎపిసోడ్‌లో పిలవాలని అనుకున్నప్పుడు మ్యాటర్ లీక్ అయ్యింది. దీంతో వీళ్లిద్దరికీ పడదు.. రవితేజ రాడు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు కనిపించాయి. వాళ్లిద్దరి మధ్య గొడవ అయ్యింది అని విపరీతమైన చర్చ నడిచింది. తీరా.. రవితేజ గురించి బాలయ్య దగ్గర చెప్పేసరికి.. వెంటనే ఆయన.. ‘నేను ఫోన్ చేయనా రవికి.. నా దగ్గర నెంబర్ ఉందిలే అని అన్నారు. ఇక రవితేజ దగ్గరకు వెళ్లి షో గురించి చెప్పాను.. రాకపోతే బయట రూమర్స్ నిజం అయ్యేవి. ఆయన ఫుల్ టైట్‌ షెడ్యూల్‌లో ఉన్నారు. నాలుగైదు సినిమాలు అనౌన్స్ చేసి ఫుల్ బిజీగా ఉన్నారు. అయినప్పటికీ బాలకృష్ణ పిలిచారు అనేసరికి.. నేను తప్పకుండా వస్తాను.. కానీ షెడ్యూల్ అడ్జస్ట్ చేసుకుని టైం నేను చెప్తా అని అన్నారు. అన్నట్టుగానే రవితేజ వచ్చారు.. సెట్‌లోకి రాగానే బాలకృష్ణ గారు రండి రవితేజ గారు అని అన్నారు. ఆ మాటకి రవితేజ.. ‘సార్.. రవితేజ గారు ఏంటండీ.. మీరు నన్ను రవితేజ అని పిలవాలి’.. అని అన్నారు.. అదీ వాళ్లిద్దరి మధ్య ఫస్ట్ డైలాగ్.. వాళ్లిద్దరూ చాలా హ్యాపీగా మాట్లాడుకున్నారు. షో అయిపోయిన తరువాత కూడా రవితేజ మాతో చాలాసేపు ఉన్నారు. మాతో కలిసి భోజనం చేసి వెళ్లారు.. నిజంగా బాలకృష్ణతో గొడవే అయితే ఇంతలా ఉండేవారా? అంటూ చెప్పుకొచ్చారు రైటర్ బీవీఎస్ రవి. ఇదిలా ఉంటే.. విక్రమార్కుడు తరువాత బాక్సాఫీస్ వద్ద రవితేజ వర్సెస్ బాలయ్య చాలాసార్లు పోటీపడ్డారు. ఒక్కమగాడు- కృష్ణ బాక్సాఫీస్ వద్ద పోటీపడగా.. ఒక్కమగాడు ఫ్లాప్ అయ్యింది.. కృష్ణ హిట్ అయ్యింది. అలాగే బాలయ్య ‘మిత్రుడు’.. రవితేజ ‘కిక్’ ఒకేసారి విడుదల కాగా.. కిక్ పెద్ద హిట్ కాగా.. మిత్రుడు ఫ్లాప్ అయ్యింది. ఇక సింహా, శంభో శివ శంభో చిత్రాల మధ్య పోటీ సాగింది. సింహా బ్లాక్ బస్టర్ హిట్ అయితే.. శంభో శివ శంభో ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. ఇంతకీ ఏ హీరోయిన్ విషయంలో వీళ్లిద్దరి మధ్య గొడవ జరిగింది? ఏమిటా రూమర్ అంటే.. రవితేజతో భద్ర సినిమా చేసింది మీరా జాస్మిన్. ఆ తరువాత ఆమెకు బాలయ్యతో నటించే అవకాశం రావడంతో... రవితేజ వద్దన్నాడని అందుకే బాలయ్య రవితేజని పిలిపించి మరీ కొట్టారనే పుకార్లు అప్పట్లో షికారు చేశాయి. ఇదిలా ఉంటే.. విక్రమార్కుడు తరువాత బాక్సాఫీస్ వద్ద రవితేజ వర్సెస్ బాలయ్య చాలాసార్లు పోటీపడ్డారు. ఒక్కమగాడు- కృష్ణ బాక్సాఫీస్ వద్ద పోటీపడగా.. ఒక్కమగాడు ఫ్లాప్ అయ్యింది.. కృష్ణ హిట్ అయ్యింది. అలాగే బాలయ్య ‘మిత్రుడు’.. రవితేజ ‘కిక్’ ఒకేసారి విడుదల కాగా.. కిక్ పెద్ద హిట్ కాగా.. మిత్రుడు ఫ్లాప్ అయ్యింది. ఇక సింహా, శంభో శివ శంభో చిత్రాల మధ్య పోటీ సాగింది. సింహా బ్లాక్ బస్టర్ హిట్ అయితే.. శంభో శివ శంభో ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. ఇంతకీ ఏ హీరోయిన్ విషయంలో వీళ్లిద్దరి మధ్య గొడవ జరిగింది? ఏమిటా రూమర్ అంటే.. రవితేజతో భద్ర సినిమా చేసింది మీరా జాస్మిన్. ఆ తరువాత ఆమెకు బాలయ్యతో నటించే అవకాశం రావడంతో... రవితేజ వద్దన్నాడని అందుకే బాలయ్య రవితేజని పిలిపించి మరీ కొట్టారనే పుకార్లు అప్పట్లో షికారు చేశాయి.


By January 25, 2022 at 10:16AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/unstoppable-talk-show-writer-bvs-ravi-about-balakrishna-and-ravi-teja-bonding/articleshow/89107220.cms

No comments