సూపర్ మచ్చి రివ్యూ.. కళ్యాణ్ దేవ్ ఇక కష్టమేనా!
మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్‌కు విజేత సినిమా ఓ మోస్తరుగా కలిసి వచ్చింది. కమర్షియల్‌గా హిట్ కాకపోయినా నటుడిగా పర్వాలేదనిపించింది. అయితే రెండోసినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చాలా కాలమే ఎదురుచూడాల్సి వచ్చింది. మొత్తానికి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వీక్ ప్రమోషన్స్‌తో ఏమాత్రం బజ్ లేకుండా వచ్చిన కళ్యాణ్ దేవ్ ఏ మాత్రం గట్టెక్కుతాడో చూడాలి. కళ్యాణ్ దేవ్ రాజు అనే పాత్రలో కనిపిస్తాడు. కన్నడ హీరోయిన్ రచితా రామ్ మీనాక్షి కారెక్టర్‌లో కనిపిస్తుంది. మీనాక్షి తన తండ్రి (రాజేంద్ర ప్రసాద్) కోరిక మేరకు తాను ప్రేమించిన వాడిని కాకుండా రాజుని ప్రేమిస్తుంది. కానీ రాజు మాత్రం మీనాక్షిని పట్టించుకోడు. మీనాక్షి గతంలో ఓ వ్యక్తిని చూడకుండా ప్రేమిస్తుంటుంది. కానీ తండ్రి కోరిక మేరకు రాజును పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. ఎలాంటి బాధ్యత లేకుండా ఫ్రెండ్స్‌తో జల్సాలు చేస్తూ షికార్లు చేసుకుంటూ బార్‌లో పాటలు పాడే కుర్రాడైన రాజు.. సాఫ్ట్ వేర్ ఉద్యోగి అయిన మీనాక్షి మధ్య లవ్ ఎలా సెట్ అయింది? అసలు మీనాక్షి ప్రేమను, రాజు ఎందుకు తిరస్కరించాడు.. మీనాక్షిని వదిలించుకోవడానికి రాజు చేసిన ప్రయత్నాలు ఏంటి? అనేవి ఆసక్తికరంగా మారినట్టు కనిపిస్తోంది. అయితే ఈ త్రికోణపు ప్రేమ కథ మాత్రం ప్రేక్షకుడిని అంతగా ఆకట్టుకోలేదనిపిస్తోంది. హీరోయిన్ ఓ తెలియని వ్యక్తిని ప్రేమించడం, హీరో కూడా అలాంటి స్థితిలోనే ఉండటం ఇలా సపరేట్ ట్రాకులతో సినిమా అంతా బోర్ కొట్టించినట్టు తెలుస్తోంది. ఇక ఈ చిత్రం రాజేంద్ర ప్రసాద్, వీకే నరేష్‌ల నటన అదిరిపోయిందని అంటున్నారు. ఈ సినిమా కళ్యాణ్ దేవ్‌కు ఏ రకంగానూ ఉపయోగపడేలా లేదనిపిస్తోంది. రచితా రామ్‌కు ఈ డెబ్యూ చేదు అనుభవంగానే మిగిలేట్టు కనిపిస్తోంది. దర్శకుడు పులి వాసు ఎంచుకొన్న పాయింట్‌ను ఎమోషనల్ లవ్ జర్నీ, ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా మలచడంలో తడబడ్డాడనిపిస్తోంది. అయితే ఈ సినిమాలో ఎలాంటి అభ్యంతరకర, అసభ్యకర సన్నివేశాలు లేకపోవవడం కాస్త ఉపశమనిచ్చే విషయం.
By January 14, 2022 at 08:35AM
No comments