ఎన్టీఆర్ సినిమాకు థియేటర్ ఇస్తే.. బాలకృష్ణ ఫోన్ చేసి చంపేస్తానని బూతులు తిట్టారు!.. గుట్టు బయట పెట్టిన నిర్మాత
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiznnF_dSNJNvA7yvMGlS2F8Mp5p3q7_b2yjJ-12wu0tJ_HB8Frugro8tY7agbK2o40802tzyVnkF7SLEmUEF0SRc3h4PFPyKfHtXXVQw_fa3WMWAne87UyT4uozsGJ74M24g_TnYYg4Wc/s320/Movie.jpg)
![](https://telugu.samayam.com/photo/89195654/photo-89195654.jpg)
‘‘’ సినిమా విడుదలకు ముందు నేను ఓసారి డైరెక్టర్ బి.గోపాల్‌గారిని కలిశాను. ఆయన నరసింహ నాయుడు సినిమాలోని టెంపుల్ ఫైట్ సీన్ చెప్పగానే సినిమా బావుంటుందనిపించింది. అప్పుడు నిర్మాత మురళీగారిని వెళ్లి కలిసి సినిమా కొన్నాం’’ అని అన్నారు నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అవుల గిరి. రీసెంట్ టైమ్‌లో నిర్మాత గిరి తన సినీ ప్రస్తానం గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. అందులో భాగంగా నరసింహ నాయుడు సినిమా గురించి ఆయన మాట్లాడుతూ ఆ సినిమా నైజాం హక్కులను మహలక్ష్మి ఫిలింస్, మల్లారెడ్డి అనే వ్యక్తితో కలిసి తాను కొనుగోలు చేశానని అన్నారాయన. అయితే ‘నరసింహ నాయుడు’ సినిమా విషయంలో హీరో బాలకృష్ణతో తను బండ బూతులు వినాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. ఇంతకీ గిరి ఏమన్నారంటే.. ‘‘ఎన్టీఆర్ తొలి సినిమా ‘’ విడుదలైంది. వాళ్లు దేవి థియేటర్ కావాలని రిక్వెస్ట్ చేశారు. సరేనని నరసింహనాయుడు సినిమాను తీసేసి, సినిమాకు ఇవ్వాలని అనుకున్నాం. నేను, దిల్‌రాజుగారి ఫంక్షన్ కోసం నిర్మల్‌కు వెళ్లాను. అప్పుడు బాలకృష్ణగారు ఫోన్ చేసి బూతులు తిట్టారు. పిచ్చి వేషాలు వేస్తే..చంపేస్తాను అని అన్నారు. సరేనని.. ఇక చేసేదేమీ లేక.. డబ్బులు వేసుకుని ఆ సినిమాను రన్ చేశాం. ఎన్టీఆర్ సినిమాను పక్క థియేటర్‌లో వేశారు’’ అన్నారు. నందమూరి బాలకృష్ణ, బి.గోపాల్ కాంబినేషన్‌లో రూపొందిన ‘నరసింహ నాయుడు’ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. 2001లో సినిమా విడుదలైంది. ఆ సినిమా 175 రోజుల రన్నింగ్‌లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. తర్వాత అదే ఏడాది మే నెలలో ఎన్టీఆర్ హీరోగా నటించిన తొలి చిత్రం నిన్ను చూడాలని విడుదలైంది. ఎన్టీఆర్ హీరోగా సినీ రంగ ప్రవేశం చేసిన చిత్రమది.
By January 29, 2022 at 11:24AM
No comments