Breaking News

బూస్టర్ డోస్‌లూ ఆపలేవు.. అందరూ ఒమిక్రాన్ బారినపడతారు: ఐసీఎంఆర్ నిపుణుడు


కొత్తరకం వేరియంట్ ఓమిక్రాన్‌ను ‘దాదాపు ఆపలేం’..చివరికి ప్రతి ఒక్కరూ దీని బారిన పడతారని ఐసీఎంఆర్ నేషనల్ ఎపిడిమియాలజీ ఇన్‌స్టిట్యూట్ సైంటిఫిక్ అడ్వైజరీ కమిటీ ఛైర్మన్ అన్నారు. అత్యంత వేగంగా వ్యాప్తిచెందే ఈ వేరియంట్‌ను కూడా అడ్డుకోలేవని ఆయన స్పష్టం చేశారు. ‘‘దీనికి వీళ్లు వాళ్లు అనే తేడా లేదు. అందరికీ ఈ ఇన్ఫెక్షన్ వస్తుంది. దీంతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఇదే జరిగింది’’ అని డాక్టర్ జయప్రకాశ్ వ్యాఖ్యానించారు. ‘‘కొత్తరకం వేరియంట్ భయపెట్టేది కాదు.. ఎందుకంటే స్వల్ప లక్షణాలున్న వల్ల ఆసుపత్రిలో చేరే అవకాశం తక్కువగా ఉంటుంది.. ఇది మనం ఎదుర్కోగల వ్యాధి.. చాలా భిన్నమైన వైరస్‌తో వ్యవహరిస్తున్నాం.. ఇది డెల్టా కంటే చాలా తేలికపాటిది.. కానీ, మన అందరికీ తెలిసినట్లుగా ఆచరణాత్మకంగా దీనిని బారినపడకుండా అడ్డుకోలేం.. ఇది కేవలం జలుబు వంటింది ’’ అని వివరించారు. ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చిన సహజ రోగనిరోధక శక్తి జీవితాంతం ఉంటుంది.. అందుకే ఇతర దేశాల మాదిరిగా భారత్ ప్రభావితం కాలేదని ఆయన పేర్కొన్నారు. వ్యాక్సినేషన్‌కు ముందే దేశంలోని 85 శాతం మంది వైరస్ బారినపడ్డారని తెలిపారు. సహజమైన ఇన్‌ఫెక్షన్ ఎటువంటి శాశ్వత రోగ నిరోధక శక్తిని ఇవ్వదని ఓ వర్గం భావిస్తోంది.. అది తప్పు అని నేను అంటాను’అని డాక్టర్ జయప్రకాశ్ అన్నారు. బూస్టర్ డోస్‌లను ఏ వైద్య సంస్థలు సూచించలేదన్న ఆయన.. మహమ్మారి సహజ పురోగతిని ఆపలేమని డాక్టర్ ములియిల్ చెప్పారు. ఈ వైరస్ కేవలం రెండు రోజుల్లోనే ఇన్ఫెక్షన్‌ని రెట్టింపు చేస్తుంది, కాబట్టి దాని ఉనికిని గుర్తించకముందే సోకిన వ్యక్తి ఇప్పటికే పెద్ద సంఖ్యలో వ్యాపించి ఉంటుందన్నారు. ‘ఇప్పటివరకు ఏ ప్రభుత్వ సంస్థల నుంచి బూస్టర్ డోస్‌ను సూచించలేదు.. నాకు తెలిసినంత వరకు ప్రికాషనరీ డోస్‌ను ఇప్పుడే సూచించారు.. ఎందుకంటే 60 ఏళ్లు దాటిన వారిలో కొందరు రెండు డోస్‌లు వేసుకున్నా ముప్పులో ఉన్నారని నివేదికలు తెలియజేశాయి’ అని అన్నారు. ‘అంతేకాదు, తాము వైరస్ బారినపడ్డామనే విషయం చాలా మందికి తెలియదు.. 80 శాతం మందికిపైగా ఇలాగే ఉంటుంది.. అధిక ముప్పు ఉన్నవారికే ప్రికాషనరీ డోస్‌ను సిఫార్సు చేశాం..గుండె జబ్బులు లేదా మధుమేహం ఉంటే రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉందని కాదు’ అని చెప్పారు.


By January 12, 2022 at 09:08AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/everyone-will-get-omicron-and-boosters-wont-stop-it-says-icmr-expert/articleshow/88845841.cms

No comments