Breaking News

ఆగిపోయిన ర‌మేష్ బాబు సినిమా... కార‌ణాలేంటో తెలుసా?


కృష్ణ త‌న‌యుడుగా అల్లూరి సీతారామరాజు చిత్రంలో యువ అల్లూరి పాత్ర‌లో క‌నిపించి సినీ రంగ ప్ర‌వేశం చేశారు ర‌మేష్ బాబు. త‌ర్వాత మ‌రి కొన్ని చిత్రాల్లో బాల న‌టుడిగా క‌నిపించారు. ‘సామ్రాట్’ చిత్రంతో హీరోగా మారారు. మొత్తం 17 సినిమాల్లో నటించారు. కెరీర్ ప్రారంభంలో బజార్ రౌడీ, కలియుగ కర్ణుడు, ముగ్గురు కొడుకులు వంటి చిత్రాలు రమేష్ బాబుకు మంచి పేరుని తెచ్చి పెట్టాయి. తర్వాత ఆయన సినిమాలు సరిగ్గా ఆడకపోవడంతో సినిమా రంగానికి హీరోగా దూర‌మ‌య్యారు. త‌ర్వాత నిర్మాత‌గా మారారు. తండ్రి పేరు మీద‌నే కృష్ణ ప్రొడ‌క్ష‌న్స్‌ను స్టార్ట్ చేశారు. దూకుడు, ఆగ‌డు చిత్రాల‌కు ర‌మేష్ బాబు స‌మ‌ర్ప‌కుడిగా ఉన్నారు. త‌ర్వాత సినీ రంగానికి ఎందుక‌నో దూర‌మ‌య్యారు. చాలా మంది హీరోల‌కు కొన్ని సినిమాలు ప్రారంభ‌మై అనుకోని కార‌ణాల‌తో ఆగిపోయిన సినిమా ఉంటుంది. అలాంటి సినిమా ర‌మేష్ బాబుకి కూడా ఉంది. ఆయ‌న హీరోగా ప్రారంభ‌మైన ‘సాహస యాత్ర’ సినిమా ఓ షెడ్యూల్ పూర్తయిన తర్వాత ఆర్థిక కార‌ణాల‌తో ఆగిపోయింది. ఇదొక అడ్వెంచ‌ర‌స్ స్టోరి. పెద్ద వంశీ ద‌ర్శ‌కుడిగా క‌థా చ‌ర్చ‌లు చేశారు. అప్ప‌ట్లో అర‌కు వెళ్లి రైట‌ర్స్‌తో కూర్చుని వంశీ క‌థ‌ను సిద్ధం చేశారు. మ‌బ్బు చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో నూరా న‌రేంద్ర రెడ్డి, టి.వి.ఎస్‌.రెడ్డి నిర్మాత‌లుగా సినిమాను నిర్మించ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. కృష్ణ‌కు క‌థ వినిపించారు. ఆయ‌న‌కు న‌చ్చింది. ఇళ‌య‌రాజా సంగీత ద‌ర్శ‌క‌త్వంలో ఓ పాట‌ను కూడా రికార్డ్ చేశారు. లొకేషన్స్ అంతా ఓకే అనుకుని షెడ్యూల్స్ ప్లాన్ చేశారు. అయితే వంశీకి, నిర్మాత‌ల‌కు ఏవో ఇబ్బందులు వ‌చ్చాయి .దాంతో సినిమా ఆగిపోయింది. దాదాపు తొమ్మిది నెల‌ల పాటు సాహ‌స యాత్ర సినిమా షూటింగ్ అలాగే ఆగింది. త‌ర్వాత నిర్మాత‌లు వెళ్లి కృష్ణ‌ను క‌లిశారు. ఆయ‌న రంగంలోకి దిగి కె.ఎస్‌.ఆర్.దాస్‌తో మాట్లాడి సినిమాను డైరెక్ట్ చేయ‌డానికి ఒప్పించారు. టీమ్ మారింది. గౌత‌మి, ర‌మ్య‌కృష్ణ‌, మ‌హాల‌క్ష్మి హీరోయిన్స్‌గా వ‌చ్చారు. ఇళ‌య‌రాజా ప్లేస్‌లోకి అప్ప‌టి ట్రెండ్‌ను అనుస‌రించి రాజ్ కోటిని మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా తీసుకున్నారు. ర‌మేష్‌బాబు.. గౌత‌మి, మ‌హాల‌క్ష్మి ల‌పై రెండు పాట‌ల‌ను, కొన్ని స‌న్నివేశాల‌ను అండ‌మాన్‌లో చిత్రీక‌రించారు. త‌ర్వాత సిమ్లా, బిక‌నీర్‌, సిమ్లాల‌లో చిత్రీక‌రించాల‌ని ప్లాన్ చేశారు. కానీ ఆర్థిక కార‌ణాలోత సినిమా ఆగిపోయింది.


By January 09, 2022 at 07:06AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/ramesh-babu-movie-sahasa-yatra-movie-stopped-reasons/articleshow/88784833.cms

No comments