Breaking News

ముంబయి పేలుళ్ల సూత్రధారికి పాక్‌లో రాజభోగాలు.. దాయాదిపై ఐరాసలో భారత్ ఆగ్రహం


ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌పై ఐక్యరాజ్యసమితి వేదికగా మరోసారి భారత్ నిప్పులు చెరిగింది. 93 ముంబయి బాంబు పేలుళ్ల సూత్రధారికి ఆశ్రయం ఇవ్వడమే కాకుండా, సకల రాజభోగాలను కల్పిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐరాస గ్లోబల్ టెర్రరిజమ్ కౌన్సిల్ నిర్వహించిన అంతర్జాతీయ ఉగ్రవాద వ్యతిరేక కాన్ఫరెన్స్ 2022లో ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి మాట్లాడుతూ.. 1993 ముంబయి బాంబు పేలుళ్లకు కారణమైన నేరస్థుడు పాక్‌లో రక్షణను మాత్రమే కాకుండా ఫైవ్ స్టార్ ఆతిథ్యాన్ని పొందడం మనం చూస్తున్నామని అన్నారు. ముంబయి పేలుళ్ల ప్రధాన సూత్రధారి అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాక్‌లోనే ఆశ్రయం పొందుతున్నాడు. దావూద్‌ ఇబ్రహీం తమ గడ్డ మీదే ఉన్నాడని 2020 ఆగస్టులో చెప్పినట్టుగానే చెప్పిన పాక్ యూ టర్న్‌ తీసుకున్న విషయం తెలిసిందే. నిషేధం విధించిన 88 ఉగ్రవాద సంస్థలు, నాయకుల జాబితాను అప్పట్లో విడుదల చేసిన పాక్‌ ప్రభుత్వం.. ఇందులో దావూద్ పేరును కూడా చేర్చింది. ఉగ్రవాదులకు నిధులు, ఆయుధాలు అందకుండా నిరోధించడంలో 1267 అల్-ఖైదా ఆంక్షల కమిటీతో సహా ఐరాసకు చెందిన అంతర్జాతీయ సంస్థల ప్రయత్నాలకు కీలకమైనవని తిరుమూర్తి అన్నారు. అయితే, ఈ చర్యల అమలు మాత్రం సవాళ్లను ఎదుర్కొంటున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘కౌన్సిల్ ఏర్పాటు చేసిన నిర్ణయాత్మక ప్రక్రియలోని ఆంక్షలు, విధి విధానాలు.. నిర్ణయం తీసుకోవడంలో తగిన ప్రక్రియను నిర్ధారించడం చాలా కీలకం.. రాజకీయ, మతపరమైన వాటి కోసం కాకుండా ఈ లక్ష్యం వేగవంతమైన, విశ్వసనీయమైన, సాక్ష్యం ఆధారంగా, పారదర్శకంగా ఉండాలి.. రిజల్యూషన్ 2560 (2020) ప్రకారం.. సభ్య దేశాల ఆస్తుల స్తంభన చర్యలు లోపాలను మానిటరింగ్ టీమ్ (MT)ఇటీవలి నివేదిక సూచిస్తుంది’’ అని తిరుమూర్తి వ్యాఖ్యానించారు.


By January 19, 2022 at 10:27AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-once-again-slams-pakistan-at-un-counsil-on-terrorism/articleshow/88988016.cms

No comments