రివ్యూ బ్యాచ్ ప్రశాంత్‌కి మొన్న నిధితో హగ్.. ఇప్పుడు మూవీ ఛాన్స్.. పిచ్చెక్కిస్తున్నాడుగా
ఈ యువకుడిని గుర్తు పట్టారా..? ఇతడికి సినిమా అంటే పిచ్చి. శుక్రవారం వచ్చిందంటే.. ఐమ్యాక్స్ దగ్గర వాలిపోతాడు. రిలీజైన సినిమా బాగున్నా.. బాగోకపోయినా తమ చేష్టలు, వ్యాఖ్యలతో ఆకాశానికెత్తేసే బ్యాచ్‌లో ఇతనొకడు. అలాంటి యువకుడికి ఇప్పుడు ఏకంగా సినిమాలో నటించే ఛాన్సే వచ్చేసింది. షూటింగ్ స్పాట్‌లో ఇలా కనిపించాడు. ఈ యువకుడి పేరు ప్రశాంత్. తరచూ పబ్లిక్ టాక్ వీడియోలు చూసేవారు ఇతడిని ‘అతిగాడు’ అని పిలుస్తారు. ఇప్పుడు తనకు ఇష్టమైన యాక్టింగ్ కూడా అతిగానే చేయడానికి సిద్ధమయ్యాడు. ప్రశాంత్ బ్యాచ్‌లో అందరూ పూనకంతో ఊగిపోతూ సినిమా రివ్యూలు చెబితే.. ఇతడు మాత్రం కాస్త భిన్నం. సినిమాలో ఉపయోగించిన ఏదో ఒక వస్తువు, లేదా మేకప్ కిట్‌తో వెరైటీగా రివ్యూ చెబుతాడు. చిన్న స్కిట్‌లా చేసి సినిమా పాయింట్‌ను కనెక్ట్ చేస్తాడు. కొన్నిసార్లు ఆ పాయింట్లు భలే పేలుతాయి. కొంత మంది తిట్టుకుంటే, మరి కొంత మంది బాగా ఎంజాయ్ చేస్తారు. ఏం.. జరిగినా సినిమాకు కావాల్సిన పబ్లిసిటీ మాత్రం వస్తుంది. అది జరిగితే చాలు.. వీళ్లు తిట్లను కూడా ఆనందంగా స్వీకరిస్తారు. సినిమా అంటే అంత ప్రేమ మరి. ప్రశాంత్ లాంటి యువకులను ఏదో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవాళ్లే గుర్తుపడతారనుకుంటే పొరపాటే. ఇండస్ట్రీ వాళ్లకు ఈ ముఖాలు సుపరిచితమే. ప్రశాంత్ విషయంలో ఇటీవల ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. యంగ్ హీరోయిన్ నిధి అగర్వాల్ ఈ యువకుడికి ఐ లవ్యూ చెప్పి హగ్ ఇచ్చారు. అందాల తార నిధి.. ‘హీరో’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా చిత్ర బ్రుందంతో కలిసి నిజాంపేట మల్లికార్జున థియేటర్‌కు ఆమె వచ్చారు. షో అనంతరం కారులో వెళ్తుండగా.. రివ్యూలు చెప్తూ సందడి చేసే యువకులంతా ఆమె వద్దకు వెళ్లారు. వాళ్లను ఆప్యాయంగా పలుకరించిన నిధి.. ప్రశాంత్‌ను దగ్గరకు పిలుచుకొని ప్రత్యేకంగా మాట్లాడారు. నిధికి అతడు ఐ లవ్ యూ చెప్పగా.. ఆమె కూడా ఐ లవ్ యూ అన్నారు. ఒక్క హగ్ ఇవ్వండి మేడమ్ అంటే.. కారులో నుంచే అతడికి హగ్ ఇచ్చారు. నిధి అగర్వాల్‌కు ఇతడు పెద్ద అభిమాని. అభిమాన నటి హగ్ ఇస్తే.. ఆ సంతోషం మామూలుగా ఉంటుందా?! ఇక.. ప్రస్తుత వీడియో ‘’ సినిమా షూటింగ్‌కి సంబంధించింది. తిప్పోజు దివ్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో హీరో శ్రీరామ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో ప్రశాంత్ ఓ పాత్రలో కనిపించనున్నాడు.
By January 22, 2022 at 10:57PM
No comments