Breaking News

ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా రామ్ గోపాల్ వర్మ..! అజయ్ భూపతిని ఓ ఆటాడుకుంటున్న నెటిజన్లు


ప్రస్తుతం ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఎవరు? టాలీవుడ్‌కి ఏ కష్టమొచ్చినా ఆదుకునేది ఎవరు? క్లిష్ట పరిస్థితుల్లో ముందుండి నడిపించేది ఎవరు? ఇదిగో ఇలాంటి అంశాలు గత కొన్నేళ్లుగా సినీ వర్గాల్లో చర్చల్లో నిలుస్తున్నాయి. ఒకప్పుడు ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉంటూ ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరించుకుంటూ వచ్చి ఇండస్ట్రీలోని అందరినీ ఒక్కతాటిపై నిలిపేవారు. అయితే ఆయన మరణం తర్వాత ఆ స్థానం ఎవరిది? అనేది మాత్రం నేటికీ సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది. అయితే కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో విరాళాలు సేకరించి సెలబ్రిటీల సహకారంలో సినీ కార్మికులకు అండగా నిలిచారు మెగాస్టార్ చిరంజీవి. క‌రోనా క్రైసిస్ స‌మ‌యంలో అందరు హీరోల‌ను ఏక‌తాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దీంతో అందరిచూపు చిరంజీవిపై పడింది. ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఆయనే అని ముర‌ళీ మోహ‌న్‌, త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స‌హా ప‌లువురు సీనియ‌ర్స్ కూడా చెప్పేశారు. మరోవైపు దాసరి తర్వాత ఇండీస్ట్రీకి పెద్ద మోహన్ బాబు అని సీనియర్ నటుడు నరేష్ అన్నారు. ఇలాంటి పరిస్థితుల నడుమ సినీ పెద్ద‌రికంపై చిరంజీవి రియాక్ట్ అయిన తీరు హాట్ టాపిక్ అయింది. తెలుగు సినీ పరిశ్రమకు పెద్ద అనే హోదా తనకు అవసరం లేదని, కానీ అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉంటానని మెగాస్టార్ అన్నారు. ఇంతలోనే 'నా మౌనం చేతకానితనం కాదు.. కలసి సినిమాని బతికిద్దాం' అంటూ టికెట్ రేట్స్ ఇష్యూపై మోహన్ బాబు రాసిన లేఖ ఇండీస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. ఇండస్ట్రీ పెద్ద దిక్కు అనే విషయం ఇంత హాట్ టాపిక్ కావడంతో డైరెక్టర్ లైన్ లోకి వచ్చి ఏకంగా పేరు ప్రస్తావించారు. ''మా బాస్ రాంగోపాల్ వర్మని ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా చూడాలని నా కోరిక. సామీ మీరు రావాలి సామీ'' అని పేర్కొంటూ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు. దీంతో ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు వర్మతో పాటు అజయ్ భూపతిని కూడా ట్రోల్ చేస్తూ కామెంట్స్ పెడుతుండటం గమనార్హం.


By January 03, 2022 at 10:58AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/director-ajay-bhupathi-comments-on-telugu-film-industry-and-ram-gopal-varma/articleshow/88659725.cms

No comments