Breaking News

Actor Jagadish: RGV నాకు ఇన్స్పిరేషన్.. ఆయన రాసిన పుస్తకమే నా జీవితాన్ని మార్చేసింది: ‘పుష్ప’ ఫేమ్ కేశవ


‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ పక్కన ఫుల్ లెంగ్త్ రోల్‌లో నటించి ఆ సినిమా విజయంలో కీ రోల్ పోషించిన నటుడు కేశవ.. అలియాస్ జగదీష్. ఈ సినిమాలో హీరో అల్లు అర్జున్ అయినప్పటికీ.. ఆయన తరువాత అంతటి ప్రాధాన్యత ఉన్న పాత్ర ఇది. ఇంకా చెప్పాలంటే.. హీరోయిన్ పాత్ర కంటే కూడా ఎక్కువ స్కోప్ ఉన్న పాత్ర చేశాడు (జగదీష్). తనది తెలంగాణలోని వరంగల్ అయినప్పటికీ చిత్తూరు యాసలో ఇరగదీశాడు కేశవ. పుష్ప సినిమాలో కేశవ కనిపించిన ప్రతి సీన్‌ని ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. నిజానికి ఈ సినిమా కథనం మొత్తం కేశవ వాయిస్ ఓవర్‌తోనే నడుస్తుంది.. అసలు సినిమానే కేశవ వాయిస్‌తో మొదలౌతుందంటే.. ఈ సినిమాలో ఈ పాత్రకు ఉన్న ప్రాధాన్యత ఎంతో అర్ధం చేసుకోవచ్చు. పలు షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌‌లతో పాటు మల్లేశం, పలాస వంటి సినిమాల్లోనూ నటించాడు జగదీష్. అయితే ‘పుష్ప’లో కేశవ రోల్ ఇతనికి స్టార్ డమ్ తీసుకుని వచ్చింది. అయితే నటుడిగా తాను ఈరోజు ఈ స్థానంలో ఉన్నానంటే దానికి కారణం రామ్ గోపాల్ వర్మే అని అంటున్నాడు జగదీష్. వర్మ రాసిన పుస్తకం చదవడం వల్లే తన లైఫ్ మారిపోయిందని అంటూ తన సక్సెస్ సీక్రెట్ చెప్పుకొచ్చాడు. ‘‘పుష్ప’ చేస్తున్నప్పుడు నాకు చాలా సినిమాల్లోనే అవకాశం వచ్చింది.. చాలా వెబ్ సిరీస్‌లలో కూడా అడిగారు. పుష్ప కోసం అవన్నీ వదిలేశా.. నాకు అంత మంచి క్యారెక్టర్ ఇచ్చారు.. క్లిక్ అయ్యే క్యారెక్టర్ ఇచ్చారు.. ఈ అవకాశం ఎవరికోగాని రాదు కాబట్టి.. ఈ సినిమా చేస్తూ ఏ క్యారెక్టర్ చేయకూడదని అనుకున్నా. నా క్యారెక్టర్ గురించి అల్లు అర్జున్ గారు మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు. నీ రోల్ అదిరిపోతుందని చాలా సలహాలు చెప్పారు.. సినిమా రిలీజ్ అయిన మరుసటి రోజే అల్లు అర్జున్ గారిని కలిశాను.. ఏం కేశవా?? ఎలా ఉంది రెస్పాన్స్ అని అడిగారు. మా అమ్మ వాళ్లతో కలిసి చూశానని చెప్పాను. అమ్మ, నాన్న, అక్క, అన్నయ్య.. దాదాపు 25 మంది నా ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి సినిమా చూడటం గ్రేట్ ఎక్స్ పీరియన్స్. సినిమా చూసి బయటకు వస్తున్నప్పుడు చాలామంది నన్ను సెల్ఫీలు అడిగారు.. అది మా నాన్న చూశారు.. హ్యాపీగా ఫీల్ అయ్యారనే అనుకుంటున్నా. సినిమా ఎలా ఉంది నాన్నా అని అంటే.. బాగానే ఉందని అన్నారు.. నాన్న చిన్నప్పటి నుంచి చాలా నేర్పించారు.. నేను ఇలా ఉన్నానంటే ఆయనవల్లే.. నాన్న మా ఊర్లో పోస్ట్‌మెన్.. అమ్మ వ్యవసాయం చేస్తుంది.. అమ్మతో పాటు నేను కూడా వ్యవసాయం చేస్తుంటా.. ఇండస్ట్రీలోనే ఏదోటి చేయాలని వచ్చాను.. ఇప్పుడు నేను అనుకున్నది సాధించినందుకు సంతోషంగా ఉంది. ‘నిరుద్యోగ నటులు’ అనే వెబ్ సిరీస్‌ చేశాను.. ఆ వెబ్ సిరీస్‌‌తోనే నాకు ఈ అవకాశం వచ్చింది. చిన్నప్పటి నుంచి నాలో నటుడు ఉన్నాడని నాకు తెలుసు.. ఇండస్ట్రీలోకి రావాలని అనుకున్నా.. ఆర్జీవీ గారు నాకు ఇన్స్పిరేషన్.. నేను కూడా సినిమాలు చేయగలను అనే నమ్మకం ఆయన వల్లే కలిగింది. ఓడ్కా విత్ వర్మ అనే పుస్తకంలో ఆయన పర్సనల్ ఎక్స్ పీరియన్స్ ఒకటి చెప్పారు.. నటన అంటే అనుభవం కాదు.. టెక్నికల్ నాలెడ్జ్ కూడా అవసరం లేదు.. ఒక విజన్ ఉండి.. చేయాలనే కసి.. నీపై నీకు నమ్మకం ఉంటే యాక్టింగ్ పెద్ద కష్టం కాదని చెప్పారు. వర్మ అంటే ఇష్టం అందుకే.. ‘ఓడ్కా విత్ వర్మ’ అనే పుస్తకం కొనుక్కుని చదివా? అదే కాదు.. ఆయన పుస్తకాలు అన్నీ చదివాను.. ఆయన మాటలు.. నన్ను ప్రభావితం చేశాయి.. నాపై నాకు నమ్మకం కలిగింది.. వెంటనే ఒకరి దగ్గర డబ్బు అప్పు అడిగి మరీ షార్ట్ ఫిల్మ్ తీశాను. ఆ షార్ట్ ఫిల్మ్‌తోనే నాపై నాకు నమ్మకం కలిగింది.. ఎప్పటికైనా ఫిల్మ్ మేకింగ్ చేయాలనేది నా ఆశ’ అంటూ చెప్పుకొచ్చారు .. అలియాస్ జగదీష్.


By January 10, 2022 at 10:56AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/pushpa-actor-jagadish-aka-keshava-great-words-about-ram-gopal-varma/articleshow/88802982.cms

No comments