నేడు టాటా సన్స్‌కు ఎయిరిండియా.. 70 ఏళ్ల తర్వాత తిరిగి మాతృ సంస్థకి
ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాను వేలంలో దక్కించుకున్న సన్స్‌కు నేడు అప్పగించనున్నారు. ప్రభుత్వ విమానయాన సంస్థ ప్రైవేటీకరణకు రెండు దశాబ్దాలుగా చేస్తున్న ప్రయత్నానికి ముగింపు పలికినట్టవుతుంది. అంతేకాదు, 70 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మాతృ సంస్థకు తిరిగి చేరడం విశేషం. ఎయిరిండియాను 1932లో టాటా ఎయిర్‌లైన్స్ పేరుతో టాటా గ్రూప్ ప్రారంభించింది. తర్వాత 1953లో నాటి ప్రధాని నెహ్రూ నాయకత్వంలోని కేంద్రం టాటా ఎయిర్‌లైన్స్‌లో అధిక వాటాలను కొనుగోలు చేయడడంతో ప్రభుత్వ రంగ సంస్థగా ఆవిర్భవించింది. ఎయిరిండియా వేలానికి సెప్టెంబరు 2021లో బిడ్డింగ్ నిర్వహించారు. ఈ బిడ్డింగ్‌లో టాటా సన్స్, స్పైస్‌జెట్ వంటి ప్రయివేట్ సంస్థలు పాల్గొన్నాయి. అయితే, వీటిలో ఎక్కువ కోట్ చేసింది. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో కూడిన త్రిసభ్య కమిటీ బిడ్డింగ్‌లను పరిశీలించి, చివరకు టాటా సన్స్‌ను ఎంపిక చేసింది. ఎయిరిండియా రూ.18,000 కోట్లకు బిడ్డింగ్ చేసింది. కాగా, టాటా ఎయిర్‌లైన్స్ పేరుతో 1932 అక్టోబర్ 15న టాటాసన్స్ లిమిటెడ్ (ప్రస్తుత టాటా గ్రూప్) సంస్థలో ఒక భాగంగా ప్రారంభమైంది. టాటా ఎయిర్‌లైన్స్ వ్యవస్థాపకుడు జేఆర్డీ టాటా టాటా స్వయంగా వీటీగా నమోదుచేసిన సింగిల్ ఇంజన్ విమానం ‘డి హావ్‌లాండ్’లో ప్రయాణించి ఎయిర్ ఇండియా తొలి ప్రయాణానికి నాంది పలికారు. కరాచీలోని డ్రిగ్‌రోడ్ ఏరోడ్రోమ్ నుంచి అలహాబాదు మీదుగా బాంబే జుహూ ఎయిర్ స్ట్రిప్ వరకు ఈ ప్రయాణం సాగింది. నష్టాలలో కూరుకుపోయిన ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిరిండియాను వదిలించుకోడానికి 2001లో బీజం పడింది. నాటి అటల్ బిహారీ వాజ్‌పేయి నాయకత్వంలోని నాటి ఎన్‌డీఏ ప్రభుత్వ ప్రయత్నం సఫలం కాలేదు. 40 శాతం వాటాల విక్రయానికి బిడ్డింగ్ నిర్వహించగా.. సింగ్‌పూర్ ఎయిర్‌లైన్స్‌తో కలిసి టాటా సన్స్ కొనుగోలుకు మొగ్గుచూపినా కార్యరూపం దాల్చలేదు. తర్వాత 2007లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం గత దశాబ్దాల్లో ఎయిర్‌లైన్స్‌కు ఎదురైన ఆర్థిక నష్టాలను అరికట్టడానికి ఎయిర్ ఇండియా, దాని అనుబంధ సంస్థ ఇండియన్ ఎయిర్‌లైన్స్‌ను విలీనం చేయాలని నిర్ణయించింది. యూపీఏ-2 ప్రభుత్వం 2011లో ఎయిర్ ఇండియాలో ఈక్విటీ ఫండింగ్‌లో ₹30,000 కోట్లను ఇన్ఫ్యూజ్ చేయడానికి అంగీకరించింది. విమానయాన సంస్థ సిబ్బందికి జీతాలు ఇవ్వడానికి అనుమతించడం కోసం ఈ చర్య తీసుకుంది. కానీ, 2017లో మోదీ ప్రభుత్వం ప్రయివేటీకరణకు ఆమోదం తెలిపింది. దీంతో మార్చి 2018లో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌తో పాటు ఎయిరిండియాలోని 76 శాతం వాటాలు, ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 50 శాతం వాటాలను విక్రయించడానికి ఆసక్తి వ్యక్తీకరణను జారీ చేయబడింది. ఇందుకు ఏ ప్రయివేట్ సంస్థలూ ఆసక్తి చూపలేదు. దీంతో 2020 జూన్‌లో 100 శాతం వాటాలను విక్రయించాలని నిర్ణయించింది. ఎయిర్ ఇండియాను నష్టాల ఊబి నుంచి గట్టెక్కించేందుకు 2012లో తీసుకొచ్చిన టర్న్ అరౌండ్ విధానానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా, ఆశించిన ఫలితాలు కనిపించకపోవడంతో ప్రయివేట్ పరం చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. స్వాతంత్య్రం రాకముందు భారత ప్రభుత్వమే ఎయిరిండియాను నిర్వహిస్తోందని, దీంతో కేంద్రంపై నాటి నుంచి నిర్వహణ ద్వారా రూ. 54 వేల కోట్ల భారం పడిందని ప్రభుత్వం ప్రకటించింది.
By January 27, 2022 at 07:30AM
No comments