Breaking News

విజృంభిస్తోన్న కోవిడ్.. కొత్తగా 27,553 కరోనా కేసులు, 1525 ఒమిక్రాన్ కేసులు


దేశంలో కోవిడ్ మళ్లీ కోరలు చాచింది. వేరియంట్ కేసులతో పాటు, కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 27,553 కోవిడ్ వైరస్ కేసులు, 284 మరణాలు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ కోవిడ్‌తో 4,81,770 మంది చనిపోయారు. 1,22,801 యాక్టివ్ కేసులున్నాయి. మరోవైపు నుంచి ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి పెరుగుతుంది. దేశంలో 1525 ఒమిక్రాన్ కేసులు రిజిస్టర్ అయ్యాయి. 23 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా ఢిల్లీ, మహారాష్ట్రలలో ఎక్కువగా ఉన్నాయి. మహారాష్ట్రలో 460, ఢిల్లీలో 351 కేసులు నమోదయ్యాయి. గుజరాత్‌లో 136, తమిళనాడులో 117, కేరళలో 109, తెలంగాణలో 67, ఏపీలో 17, కర్ణాటకలో 64, హర్యానాలో 63, పశ్చిమ బెంగాల్లో 20, ఒడిశాలో 14, మధ్యప్రదేశ్‌లో 9, యూపీలో 8, ఉత్తరాఖండ్‌లో 8, చండీఘడ్‌, జమ్మూ కశ్మీర్‌లో 3, గోవా, హిమాచల్ ప్రదేశ్, లఢక్, మణిపూర్, పంజాబ్‌లో ఒక్కొక్కటి చొప్పున ఒమిక్రాన్ కేసులు ఉన్నాయి. అయితే కొత్త ఒమిక్రాన్ వేరియంట్‌ నుంచి 560 మంది కోలుకున్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కోవిడ్, ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుదలతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తతో వ్యవహరిస్తున్నాయి. కేసులు కట్టడి చేసేందుకు ఉన్న ఆంక్షలను మరింత కఠినతరం చేస్తున్నాయి. మాస్క్ పెట్టుకోవడం, భౌతిక దూరం పాటించడంతో పాటు కొత్త నిబంధనలు పెడుతున్నాయి. హర్యానాలో ఎక్కువ కేసులు నమోదవుతున్న జిల్లాల్లో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, హోటళ్లు, రెస్టారెంట్లు, మాల్స్, మార్కెట్‌ల్లోకి వ్యాక్సిన్ వేయించుకున్న వారికి మాత్రమే అనుమతించేలా ఆంక్షలు విధించారు. ఆ నిబంధనలు కఠినంగా అమలు చేసేందుకు హర్యానా ఆరోగ్య మంత్రి అనిల్ విజ్ ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేశారు. పశ్చిమ బెంగాల్లో జనవరి 3న కోల్‌కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో విద్యార్థుల వారోత్సవాల సందర్భంగా నిర్వహించాల్సిన కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది. కోవిడ్ కేసుల ఉధృతి కారణంగా రాష్ట్రాల్లో తాత్కాలిక ఆస్పత్రులను అందుబాటులోకి తేవాలని కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నవారి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని కోరింది. కోవిడ్ బారిన పడిన అందరికి తక్షణమే వైద్య సాయం అందేలా రాష్ట్రాలకు చర్యలు తీసుకోవాలని కోరింది.


By January 02, 2022 at 12:27PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/27553-fresh-covid-cases-india-1525-omicron-cases-reported-in-24-hours/articleshow/88645472.cms

No comments