Breaking News

కొత్త ఏడాది వేళ పెను విషాదం: వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట.. 12 మంది మృతి


కొత్త సంవత్సరం వేళ విషాదం నెలకొంది. జమ్మూ కశ్మీర్‌లోని మాతా చోటుచేసుకుని.. 12మంది భక్తులు మృతి చెందగా.. 13 మంది గాయపడ్డారు. కొత్త సంవత్సరం సందర్భంగా ఆలయంలో పూజల కోసం భక్తులు భారీగా తరలిరావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. క్షతగాత్రులను చికిత్స కోసం అధికారులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఢిల్లీ, హరియాణా, పంజాబ్‌, జమ్మూకశ్మీర్‌‌కు చెందిన భక్తులున్నట్టు గుర్తించారు. శనివారం తెల్లవారుజామున 2.45గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఆలయం వెలుపల త్రికూట కొండపై తొక్కిసలాట చోటుచేసుకుంది. తొలుత భక్తుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని తొక్కిసలాటకు దారితీసిందని డీజీపీ దిల్బాగ్ సింగ్ తెలిపారు. ‘కట్రాలోని మాతా వైష్ణోదేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు.. మరో 13 మంది గాయపడ్డారు.. తెల్లవారుజామున 2.45 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది.. భక్తుల మధ్య వాగ్వాదం క్రమంగా పెరిగి ఒకరినొకరు తోసుకునే వరకు వెళ్లి తొక్కిసలాటకు దారితీసింది’ అని పేర్కొన్నారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. తొక్కిసలాటలో 12 మంది మృతిచెందడంపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున ప్రధాని పరిహారం ప్రకటించారు. మరోవైపు, జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం సైతం బాధితులకు పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10లక్షలు, క్షతగాత్రులకు రూ.2 లక్షల చొప్పున పరిహారం అందజేయనున్నట్టు జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ తెలిపారు.


By January 01, 2022 at 07:55AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/12-dead-in-stampede-at-vaishno-devi-temple-in-kashmir-and-rescue-operations-under-way/articleshow/88627274.cms

No comments