Breaking News

Covid Tablet మోల్నూపిరావర్‌‌కు ఆమోదం దిశగా అమెరికా.. భారత్‌లో వినియోగానికి మార్గం సుగమం


అమెరికా ఫార్మా సంస్థ మెర్క్ అభివృద్ధి చేసిన ‘మోల్నూపిరావిర్’ ()మాత్రను అత్యవసర వినియోగం కింద బ్రిటన్ ఆమోదించిన విషయం తెలిసిందే. తాజాగా, అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్‌కు చెందిన నిపుణుల సలహా కమిటీ ఈ ఔషధం వినియోగానికి సిఫార్సు చేసింది. ఈ మాత్రలను రోగులు ఇంటి వద్ద ఉంటూనే తీసుకోవచ్చని తెలిపింది. ఒకవేళ నిపుణుల సలహా కమిటీ సిఫార్సులను ఆమోదిస్తే.. భారత్‌లోనూ మోల్నూపిరావిర్ అత్యవసర వినియోగానికి మార్గం సుగమం అవుతుంది. స్వరసాధారణంగా నిపుణుల కమిటీ సిఫార్సులను రెగ్యులేటరీలు ఆమోదిస్తాయి. భారత్‌లోనూ మోల్నూపిరావర్‌ను అత్యవసర వినియోగం కింద సిఫార్సుకు నిపుణుల కమిటీ వెచిచూస్తోందని ఎందుకంటే ఔషధం అభివృద్ధి చేసిన దేశంలో అనుమతించలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా, కొత్తరకం వేరియంట్ ఒమిక్రాన్‌ వల్ల టీకా ద్వారా లభించిన సహజ వ్యాధి నిరోధకతకు ఒకవేళ ముప్పు ఏర్పడితే మోల్పూపిరావర్ కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఔషధానికి సంబంధించిన అదనపు సమాచారం సంతృప్తికరంగా ఉంటే తదుపరి సమావేశంలో అత్యవసర వినియోగం ఆమోదానికి నిపుణుల కమిటీ సిఫార్సు చేయనుందని అధికారులు తెలిపారు. మోల్నూపిరావర్‌కు ఆమోదం కోసం నాట్కో, డాక్టర్ రెడ్డీ, సిప్లా, సన్ ఫార్మా, నేట్కో, బీడీఆర్ ఫార్మ సహా పలు భారతీయ కంపెనీలు ఎదురుచూస్తున్నాయి. ఈయూఏ లభించడమే తరువాయి దేశంలోకి మోల్నూపిరావర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నాయి. మెర్క్ ఇప్పటికే ఐదు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది.. స్వల్ప నుంచి మోస్తరు కోవిడ్-19 చికిత్సలో ఈ ఔషధానికి మరి కొద్ది రోజుల్లో అనుమతి లభించనుందని సీఎస్ఐఆర్ కోవిడ్ స్ట్రాటజీ గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ రామ్‌ విశ్వకర్మ గత నెలలో వెల్లడించారు. మెర్క్, రిడ్జ్ బ్యాక్ బయోథెరప్యుటిక్స్ సంస్థలు సంయుక్తంగా రూపొందించిన టాబ్లెట్‌‌ను గేమ్ ఛేంజర్‌గా భావిస్తున్నారు. అధిక ముప్పు ఉన్నవారు.. రోగ నిరోధకత బలహీనంగా ఉన్న వ్యక్తులకు ఆస్పత్రిలో చేరు ప్రమాదాన్ని సగం వరకు తగ్గిస్తుందని భావిస్తున్నారు.


By December 02, 2021 at 12:21PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/usfda-nod-to-clear-way-for-anti-covid-drug-molnupiravir-use-in-india/articleshow/88045792.cms

No comments