Breaking News

అత్యాచారం అనివార్యమైతే ఆస్వాదించండి.. అసెంబ్లీలో నోరుజారిన కాంగ్రెస్ ఎమ్మెల్యే!


కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. అత్యాచారం నుంచి తప్పించుకోలేనప్పుడు.. దాన్ని ఆనందంగా ఆస్వాదించడమే ఉత్తమమంటూ సీనియర్‌ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్‌ కేఆర్ రమేశ్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్య చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో రైతుల సమస్యపై చర్చను పొడిగించాలని సభ్యులు ఆందోళన చేయడంతో వారిని స్పీకర్‌ విశ్వేశ్వర్‌ హేగ్డే కగేరీ వారించారు. అయినా ఎమ్మెల్యేలు వెనక్కు తగ్గకపోవడంతో స్పీకర్‌కు వారిని సముదాయించడం తలకు మించిన భారంలా అనిపించింది. ఈ సమయంలో ‘‘నేనెలాంటి పరిస్థితిలో ఉన్నానంటే.. అన్నింటినీ అస్వాదిస్తూ ‘అవును’, ‘అవును’ అంటూ ఉండాలి. అంతే’’ అని స్పీకర్‌ నవ్వుతూ వ్యాఖ్యానించారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే రమేశ్‌ కుమార్‌ స్పందిస్తూ.. ‘‘అత్యాచారం అనివార్యమైనప్పుడు ఆనందంగా దాన్ని ఆస్వాదించాలి అని ఓ సామెత ఉంది. మీరిప్పుడు సరిగా అలాంటి పరిస్థితిలోనే ఉన్నారు’’ అని వ్యంగ్యంగా అన్నారు. ఈ వ్యాఖ్యలపై అధికార సభ్యులు తీవ్రంగా మండిపడుతున్నారు. చట్టసభలో ఇటువంటి వ్యాఖ్యలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే, కర్ణాటకలో ప్రజాప్రతినిధులు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. కొద్ది నెలల కిందట మైసూర్‌లో సరదాగా గడపడానికి వచ్చిన జంటపై మృగాలు పైశాచికంగా విరుచుకుపడ్డాయి. స్నేహితుడిని దారుణంగా కొట్టి యువతి సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కర్ణాటక హోం మంత్రి జ్ఞానేంద్ర నోరుజారి విమర్శలను ఎదుర్కొన్నారు. తన స్నేహితుడితో కలిసి ఆమె నిర్జన ప్రదేశానికి వెళ్లి ఉండాల్సింది కాదని వ్యాఖ్యానించారు. అలాగే, ఈ ఘటనపై తనను లక్ష్యంగా చేసుకుని ప్రతిపక్ష కాంగ్రెస్ తనపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నిస్తోందని అరగ జ్ఞానేంద్ర చేసిన వ్యాఖ్యలతో దుమారం రేగింది. దీంతో మంత్రి తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాల్సి వచ్చింది.


By December 17, 2021 at 09:33AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/congress-mla-and-ex-speaker-outrageous-remark-in-karnataka-assembly/articleshow/88331739.cms

No comments