Breaking News

పార్లమెంట్‌లో అగ్ని ప్రమాదం.. సకాలంలో స్పందించడంతో తప్పిన ముప్పు


శీతకాల పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతుండగా.. పార్లమెంటు భవనంలో చోటుచేసుకోవడం కలకలం రేగుతోంది. బుధవారం ఉదయం 8 గంటలకు పార్లమెంటులోని 59వ గదిలో మంటలు చెలరేగాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే, తక్షణమే అగ్నిమాపక దళాలు స్పందించి కొద్ది సేపట్లోనే మంటలను అదుపు చేశాయని అన్నారు. పార్లమెంట్ ఆవరణలో ఎప్పుడూ ఓ ఫైర్ ఇంజిన్ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. కాగా, ఈ ప్రమాదానికి గల కారణం తెలియరాలేదని, విచారణ జరుగుతోందని పేర్కొన్నారు. 10 నిమిషాల్లోనే మంటలు అదుపులోకి వచ్చినట్టుగా సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రమాదంలో కొన్ని కూర్చీలు, టెబుల్స్, కంప్యూటర్‌లు సహా ఫర్నిచర్ కాలిపోయినట్టుగా తెలుస్తోంది. అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియరాలేదని అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. శీతాకాల సమావేశాలు జరుగుతున్న వేళ అగ్ని ప్రమాదం సంభవించడం కలకలం రేగింది. అయితే, ఉదయం 8 గంటల ప్రాంతంలో ప్రమాదం జరగడంతో పార్లమెంట్ సభ్యులు ఎవరూ ప్రాంగణంలో లేరు. గతేడాది ఆగస్టులోనూ పార్లమెంట్ అనెక్స్ భవనం ఆరో అంతస్తులో స్వల్ప అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. భవనంలోని ఆరో అంతస్తులో మంటలు చెలరేగడంతో ఏడు ఫైర్ ఇంజిన్ల సాయంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. అనెక్స్ ఆరో అంతస్తులోని ఎలక్ట్రికల్ బోర్డు వద్ద తొలుత మంటలు వచ్చి వ్యాపించాయి. దీంతో అధికారులు అప్రమత్తమయి అగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.


By December 01, 2021 at 12:06PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/minor-fire-accident-in-parliament-building-blaze-under-control-now/articleshow/88024548.cms

No comments