Breaking News

డెల్టాతో పోల్చితే ఒమిక్రాన్ రీఇన్‌ఫెక్షన్ మూడు రెట్లు ఎక్కువ.. సంచలన అధ్యయనం


డెల్టా లేదా బీటా వేరియంట్‌లతో పోల్చితే రీ‌-ఇన్‌ఫెక్షన్‌కు కారణమయ్యే అవకాశాలు మూడు రెట్లు ఎక్కువని దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తల ప్రాథమిక అధ్యయనం పేర్కొంది. ఆ దేశ ఆరోగ్య వ్యవస్థ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా గురువారం ఈ నివేదికను శాస్త్రవేత్తలు వెల్లడించారు. గతంలో వైరస్ బారినపడి లేదా టీకా తీసుకోవడం ద్వారా వచ్చిన రోగనిరోధక శక్తిని తప్పించుకునే ఒమిక్రాన్ వేరియంట్ సామర్ధ్యం గురించి మొట్టమొదటి శాస్త్రీయ ఆధారం ఇదే కావడం గమనార్హం. మెడికల్ ప్రీప్రింట్ సర్వర్‌లో అప్‌లోడ్ చేసిన ఈ నివేదికను ఇంకా సమీక్షించాల్సి ఉంది. నవంబరు 27 వరకు 2.8 మిలియన్ల వ్యక్తులకు నిర్వహించిన పరీక్షల్లో 35,670 మంది రీఇన్‌ఫెక్షన్‌‌కు గురయినట్టు తేలింది. వైరస్ సోకిన 90 రోజుల వ్యవధిలో తిరిగి పాజిటివ్‌గా తెలితే వారిని రీ-ఇన్‌ఫెక్షన్‌గా పరిగణిస్తారు. ‘మూడు వేవ్స్‌లో ప్రాథమికంగా వైరస్ సోకిన వ్యక్తులలో ఇటీవలి రీఇన్‌ఫెక్షన్‌లు సంభవించాయి.. డెల్టా వేవ్‌లో ఇది ఎక్కువగా ఉంది’ అని దక్షిణాఫ్రికా డీఎస్ఐ ఎన్ఆర్ఎఫ్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఇన్ ఎపిడిమియాలజికల్ మోడలింగ్ అండ్ అనాలిసిస్ విభాగం డైరెక్టర్ జులియట్ పుల్లియమ్ అననారు. అయితే, వ్యాక్సినేషన్ స్థితి గురించి ఆథర్స్ ఎటువంటి డేటా ఇవ్వలేదు.. అందువల్ల ఓమిక్రాన్ టీకా వల్ల వచ్చిన రోగనిరోధక శక్తిని ఏ మేరకు తప్పించుకుంటుందో అంచనా వేయలేకపోయింది.. పరిశోధకులు దీనిపై తదుపరి అధ్యయనం నిర్వహించాలని భావిస్తున్నారు.. గతంలో కరోనా వైరస్ బారినపడ్డ వ్యక్తుల సహా ఓమిక్రాన్ ఇన్ఫెక్షన్‌తో సంబంధం ఉన్న తీవ్రతపై కూడా డేటా తక్షణమే అవసరం’అని ఆమె చెప్పారు. అయితే, ఈ అధ్యయనాన్ని సౌతాంప్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత మైఖేల్ హెడ్ ప్రశంసించారు. ఇది అత్యుత్తమ అధ్యయనమని ప్రశంసించారు. ‘గతంలో వైరస్ సోకినప్పుడు పొందిన రోగనిరోధక శక్తి ని సాపేక్షంగా సులభంగా తప్పించుకుంటోందనే ఈ విశ్లేషణ చాలా దగ్గరగా ఉంది.. .. ఇవన్నీ ఇప్పటికీ 'తప్పుడు హెచ్చరిక' అయి ఉండవచ్చా? అనే అవకాశం తక్కువగా కనిపిస్తోంది’ అన్నారు. దీనికి ముందు దక్షిణాఫ్రికా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్ఐసీడీ)కి చెందిన టాప్ సైంటిస్ట్ అన్నే వోన్ మాట్లాడుతూ.. కేసులు పెరుగుతున్నాయి కానీ, ఒమిక్రాన్‌ను వ్యాక్సిన్లు సమర్ధంగా ఎదుర్కొంటాయని అధికారులు భావిస్తున్నారని తెలిపారు. డబ్ల్యూహెచ్ఓ ఆఫ్రికా రీజియన్ న్యూస్ కాన్ఫరెన్స్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలోని అన్ని ప్రావిన్సుల్లో అత్యంత భారీ సంఖ్యలో కేసులు పెరుగుతాయని నమ్ముతున్నామని అన్నారు. ‘టీకాలు ఇప్పటికీ తీవ్రమైన వ్యాధుల నుంచి కాపాడతాయని మేము నమ్ముతున్నాము.. తీవ్రమైన వ్యాధులు, ఆసుపత్రిలో చేరడం.. మరణం ముప్పు నుంచి రక్షించడానికి సహకరిస్తాయి’ అని వోన్ తెలిపారు. ఇక, నవంబరు మధ్య నాటికి రోజుకు 300 కేసులు నమోదుకాగా. కొద్ది రోజుల్లో ఇవి రెట్టింపయ్యాయి. సోమవారం 2,273 మందికి కొత్తగా వైరస్ సోకగా.. మంగళవారానికి ఇవి 4,373కి బుధవారానికి 8,561కి చేరాయి.


By December 03, 2021 at 09:50AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/reinfections-3-times-more-likely-with-omicron-compared-to-delta-says-south-africa-study/articleshow/88064063.cms

No comments