Breaking News

టీకా సామర్ధ్యాన్ని తగ్గించేస్తోన్న ఒమిక్రాన్.. డబ్ల్యూహెచ్‌ఓ కీలక వ్యాఖ్యలు


దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొత్తరకం వేరియంట్ ఒమిక్రాన్‌ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ () కీలక సమాచారం వెల్లడించింది. కంటే వేగంగా వ్యాప్తిచెందుతుందని, టీకా సామర్థ్యాన్ని కూడా తగ్గిస్తోందని హెచ్చరించింది. కానీ, ప్రాథమిక డేటా ప్రకారం లక్షణాల తీవ్రత తక్కువగా ఉన్నాయని పేర్కొంది. దేశంలో రెండో దశ కరోనా వ్యాప్తికి కారణమైన డెల్టా వేరియంట్‌ను భారత్‌లోనే తొలిసారి గుర్తించిన విషయం తెలిసిందే. ప్రపంచంలోని అధిక శాతం ఇన్‌ఫెక్షన్లకు ఈ స్ట్రెయిన్ కారణమయ్యింది. కానీ, కొత్తరకం వేరియంట్‌లో పెద్ద సంఖ్యలో మ్యుటేషన్లు ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిని అడ్డుకోడానికి పలు దేశాలు మరోసారి ఆంక్షల్లోకి జారుకున్నాయి. డిసెంబరు 9 నాటికి ఒమిక్రాన్ 63 దేశాలకు విస్తరించినట్టు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. డెల్టా వ్యాప్తి తక్కువగా ఉన్న దక్షిణాఫ్రికాలో.. డెల్టా ఆధిపత్యం కొనసాగుతున్న బ్రిటన్‌లోనూ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తించెందుతోంది. ఒమిక్రాన్ వ్యాప్తి తీవ్రత, వ్యాధినిరోధకతను ఏమార్చుతున్నట్టు సరైన సమాచారం ఇంకా అందుబాటులో లేనందున దీనిపై అప్పుడే నిర్ధారణకు రాలేమని స్పష్టం చేసింది. అయితే, వ్యాక్సిన్ సమర్ధతను తగ్గించడం సహా వేగంగా వ్యాప్తిచెందుతున్నట్టు ఇప్పటి వరకూ ఉన్న ఆధారాలు తెలియజేస్తున్నాయని వ్యాఖ్యానించింది. ‘ప్రస్తుతం అందుబాటులో ఉన్న డేటాను బట్టి కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ జరిగే డెల్టా వేరియంట్‌ను ఒమిక్రాన్ అధిగమించే అవకాశం ఉంది’ అని నొక్కిచెప్పింది. ఓమిక్రాన్ సోకినవారు ఇప్పటివరకు ‘తేలికపాటి’ అనారోగ్యం లేదా అసంప్టమాటిక్ కేసులకు కారణమయ్యాయి.. అయితే వేరియంట్ క్లినికల్ తీవ్రతను నిర్ధారించడానికి డేటా సరిపోదని తెలిపింది. కాగా, కొత్తరకం వేరియంట్ B.1.1.529 రకం వేరియంట్‌ను గుర్తించినట్టు నవంబరు 24న డబ్ల్యూహెచ్‌ఓకి దక్షిణాఫ్రికా సమాచారం ఇచ్చింది. టీకా రోగనిరోధకతపై ఒమిక్రాన్ దాడిచేస్తున్నట్టు పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో బూస్టర్ డోస్ కోసం పలు దేశాలు మొగ్గుచూపుతున్నాయి. మూడు డోస్‌ల తమ టీకా ఒమిక్రాన్‌పై సమర్ధంగా పనిచేస్తోందని ఫైజర్-బయోఎన్‌టెక్ గతవారం వెల్లడించింది. ఇప్పటికే బ్రిటన్, ఫ్రాన్స్‌లు బూస్టర్ డోస్‌లకు అనుమతించాయి.


By December 13, 2021 at 09:00AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/omicron-variant-reduces-vaccine-efficacy-and-spreads-faster-says-who/articleshow/88248285.cms

No comments