Breaking News

పెళ్లి ఒక‌రితో.. ఫ‌స్ట్ నైట్ ఇంకొక‌రితో అనిపిస్తుంది.. బాలీవుడ్‌పై త‌మ‌న్ సంచ‌న‌ల వ్యాఖ్య‌లు


ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్‌, బిజియెస్ట్‌, స‌క్సెస్‌ఫుల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎవ‌రైనా ఉన్నారా? అంటే ఠ‌క్కున్న మ‌న మ‌న‌సులో మెదిలే పేరు ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లోని అగ్ర హీరోలంద‌రి సినిమాల‌కు ప‌నిచేసి.. ప‌ని చేస్తున్న ఈ సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ రీసెంట్‌గా సీనియ‌ర్ క‌మెడియ‌న్‌, న‌టుడు అయిన అలీతో స‌ర‌దాగా ఇంట‌ర్వ్యూలో మాట్లాడారు. ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చారు త‌మ‌న్‌. ఆరో త‌ర‌గ‌తి వర‌కు మాత్ర‌మే చ‌దువుకున్న త‌ను అస‌లు మ్యూజిక్ రంగంలోకి ఎందుకు వ‌చ్చాన‌నే దానిపై మాట్లాడిన త‌మ‌న్‌. బాలీవుడ్‌లో సినిమాల‌కు సంగీతం చేయ‌డం గురించి మాట్లాడిన మాట‌లు ఇప్పుడు నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి. టాలీవుడ్‌లో ఎన్నో సూప‌ర్ డూప‌ర్ హిట్ చిత్రాల‌కు వ‌ర్క్ చేశారు క‌దా, మ‌రి బాలీవుడ్‌లో ఎందుకు సినిమాలు చేయలేదు అని అలీ ప్ర‌శ్నించిన‌ప్పుడు త‌మ‌న్ మాట్లాడుతూ ‘‘గోల్ మాల్, సింబా, సూర్యవంశీ చిత్రాలకు పనిచేశాను. ఒక్కో సినిమాకు అక్క‌డ ఆరు మంది మ్యూజిక్ డైరెక్ట‌ర్స్ ఎలా ప‌నిచేస్తారో అర్థం కావ‌డం లేదు. ఓ రీల్ రీ రికార్డింగ్ చేయ‌మ‌నో, ఓ పాట చేయ‌మ‌నో అడుగుతారు. అలా చేయ‌డం నా వ‌ల్ల కావ‌డం లేదు. అంటే.. పెళ్లి ఒక‌రితో ఫ‌స్ట్ నైట్ ఇంకొక‌రితో లాగా అయిపోతుంది’’ అని కాస్త కటువుగానే సమాధానం ఇవ్వడంతో ఖంగు తినడం అలీ వంతైంది. అలాగే రీసెంట్‌గా బాల‌కృష్ణ హీరోగా న‌టించిన అఖండ విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది. ఈ సినిమాకు కూడా త‌మ‌న్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎందుకు అంత ఎక్కువ‌గా ఇచ్చావు అన‌గానే, దేవుడు గుడిలో దేవుడుని చూపిస్తున్నప్పుడు డ‌ప్పులు కొడ‌తారు క‌దా, అక్క‌డ‌కు వెళ్లి సౌండ్ త‌గ్గించ‌మ‌ని అడుగుతారా? లేదు కదా, అలాగే ఇక్క‌డ బాల‌కృష్ణ‌ను చూస్తే శివుడుని చూస్తున్న‌ట్లు అనిపించింది అని స‌మాధానం ఇచ్చారు త‌మ‌న్‌.


By December 21, 2021 at 09:46AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/ss-thaman-sensational-comments-on-bollywood/articleshow/88403468.cms

No comments