Breaking News

హైస్కూల్‌లో కాల్పులకు పాల్పడ్డ టీనేజర్.. ముగ్గురు విద్యార్థులు మృతి


అమెరికాలో మరోసారి గన్ కల్చర్ పడగవిప్పింది. మైనర్ బాలుడు కాల్పులు తెగబడ్డాడు. మిచిగాన్‌ రాష్ట్రంలోని డెట్రాయిట్‌ నగరానికి సమీపంలో ఉన్న ఆక్స్‌ఫర్డ్ పాఠశాలలో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా.. మరో ఎనిమిది మంది గాయడ్డారు. వీరిలో ఒక ఉపాధ్యాయుడు ఉన్నట్లు అక్కడి మీడియా వర్గాలు తెలిపాయి. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కకు చేరుకుని పాఠశాలను చుట్టుముట్టాయి. అనంతరం కాల్పులకు పాల్పడిన నిందిత బాలుడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి సెమీ-ఆటోమేటిక్ హ్యాండ్‌గన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు 15-20 రౌండ్లు కాల్పులు జరిపినట్టు పోలీసులు వివరించారు. కాల్పుల్లో చనిపోయినవారిలో 16 ఏళ్ల బాలుడు, 14, 17 ఏళ్ల బాలికలు ఉన్నారని చెప్పారు. గాయపడినవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని, వీరికి శస్త్రచికిత్స కొనసాగుతోందని పేర్కొన్నారు. మిగతా ఆరుగురి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. అరెస్ట్ సమయంలో అనుమానితుడు ప్రతిఘటించలేదని, లాయర్‌ను నియమించాలని కోరాడని పోలీసు అధికారులు చెప్పారు. ఇది చాలా విపత్కర పరిస్థితి అని స్థానిక అధికారి మైఖేల్ మెక్‌క్యాబ్ తెలిపారు. చనిపోయిన ముగ్గూరు విద్యార్థులేనని పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్నం కాల్పులు చోటుచేసుకున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. కాల్ వచ్చిన ఐదు నిమిషాల్లోనే అక్కడకు చేరకుని నిందితుడ్ని కస్టడీలోకి తీసుకున్నారు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మిచిగాన్ పర్యటనలో ఉన్న ఆయన ప్రియమైనవారిని కోల్పోయిన కుంటుబాలకు ఇది తీరని లోటని ఆవేదన చెందారు. ఈ దుర్ఘటనతో అమెరికా సమాజం మొత్తాన్ని షాక్‌కు గురిచేసిందన్నారు. మరోవైపు, నిందితుడి తల్లిదండ్రులను కలిసిన పోలీసులు.. వారి నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు.


By December 01, 2021 at 09:12AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/three-killed-in-fire-at-high-school-by-student-in-us/articleshow/88021111.cms

No comments