Breaking News

Bipin Rawat సతీమణి మధులిక.. సామాజిక సేవలో ఆమెకు ఆమే సాటి


ఆర్మీ హెలికాప్టర్‌ దుర్ఘటనలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్‌ బిపిన్‌ రావత్‌ దంపతులు సహా 13 మంది దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. రావత్ సతీమణి మధులికా రావత్‌.. సామాజిక సేవకు నిలువెత్తు నిదర్శనం. ఆపన్నులను ఆదుకునే అమృతమూర్తిగా గుర్తింపు పొందిన మధులిక.. భారత సైన్యంలో సేవా కార్యక్రమాలకు ప్రతిరూపంగా నిలిచారు. దేశంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థల్లో ఒకటైన సైనికుల భార్యల సంక్షేమ సంఘం (ఏడబ్ల్యూడబ్ల్యూఏ) అధ్యక్షురాలిగా పనిచేశారు. సైనిక కుటుంబాల సంక్షేమం కోసం కృషిచేసే ఈ సంస్థ బాధ్యతలను నిర్వమించిన మధులిక.. శత్రువులతో పోరాడుతూ అమరులైన జవాన్ల కుటుంబాలకు మధులిక ఓదార్పునిచ్చేవారు. దివ్యాంగులైన పిల్లల కోసం అనేక కార్యక్రమాలను చేపట్టారు. సైనికుల కుటుంబ సభ్యుల్లోని నైపుణ్యాలను వెలికి తీసేందుకు ఆమె కృషి చేశారు. వారికోసం కుట్లు, అల్లికలు, సంచుల తయారీ, బ్యుటీషియన్‌ కోర్సులను ప్రారంభించారు. ఆరోగ్యంపైనా అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. దీనికి సమాంతరంగా సాధారణ ప్రజల కోసం కూడా అనేక సామాజిక కార్యక్రమాలను మధులిక చేపట్టారు. ముఖ్యంగా క్యాన్సర్‌ బాధితుల శ్రేయస్సు కోసం ఎంతగానో ప్రయత్నించారు. మధులిక స్వస్థలం మధ్యప్రదేశ్‌లోని షాడోల్. ఆమె విద్యాభ్యాసం గ్వాలియర్‌లోని సింధియా కన్యా విద్యాలయలో సాగింది. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి సైకాలజీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. బిపిన్ రావత్‌తో 1986లో వివాహం జరగ్గా.. వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. ఒకరు ముంబయిలో ఉండగా.. చిన్న కుమార్తె వారితోనే ఉంటున్నారు. వివాహ సమయానికి రావత్ ఆర్మీ‌లో కెప్టెన్‌గా ఉన్నారు. మధులిక కుటుంబం షాడోల్‌లోని తమ పూర్వీకుల నివాసంలో ఉంటున్నారు. మధులిక తండ్రి మృగేంద్ర సింగ్.. షోగ్‌పూర్ సంస్థానాధిపతి. ఆయన 1967, 722లో రెండు సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా పనిచేశారు. తమ కుటుంబానికి చాలా సన్నిహితురాలని చత్తీస్‌గఢ్ మంత్రి టీఎస్ సింగ్‌దేవ్‌ అన్నారు.


By December 09, 2021 at 10:53AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/know-about-cds-chief-bipin-rawat-wife-madhulika-rawat-and-her-biography/articleshow/88179560.cms

No comments