Army హెలికాప్టర్ ప్రమాదం.. ఈ కెప్టెన్ మృత్యుంజయుడు.. గతేడాది కూడా ఇలాగే..
తమిళనాడులోని నీలగిరిలో ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదవశాత్తూ కుప్పకూలిన ఘటనలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ దంపతులు సహా 13 మంది దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో హెలికాప్టర్‌లోని 14 మందిలో 13 మంది ప్రాణాలు కోల్పోగా.. గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. అయితే, తీవ్రంగా గాయపడిన ఆయనకు వెల్లింగ్టన్‌లోని సైనిక ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోన్నట్టు సమాచారం. కెప్టెన్ వరుణ్ సింగ్ పరిస్థితి కూడా విషమంగానే ఉందని తెలుస్తోంది. Read Also: ఇండియన్ ఆర్మీలో విశేష సేలందించిన వరుణ్ సింగ్..ఈ ఏడాది ఆగస్టు 15న శౌర్య చక్ర అవార్డును అందుకున్నారు. గతేడాది అక్టోబరు 12న ఆయన నడుపుతున్న యుద్ధ విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు .. వైఫల్యాన్ని సరిగ్గా గుర్తించి ల్యాండింగ్ కోసం తక్కువ ఎత్తుకు విమానం దింపుతుండగా.. ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్ విఫలమై పూర్తిగా నియంత్రణ కోల్పోయింది. ధైర్య సాహసాలు ప్రదర్శించి, చాకచక్యంగా ఎలాంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా దింపారు. Read Also: ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కెప్టెన్ వరుణ్ సింగ్ త్వరగా కోలుకోవాలని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆకాంక్షించారు. ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఆయన.. ‘వెల్లింగ్టన్ మిలిటరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ త్వరగా కోలుకోవాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను’ అని పేర్కొన్నారు. Read Also: ప్రస్తుత ప్రమాద సమయంలో హెలికాప్టర్ తక్కువ ఎత్తులో ప్రయాణిస్తోంది. పొగమంచు కారణంగా వెలుతురు సరిగా లేకపోవడంతో కాట్టేరి కొండ ప్రాంతంలో ఓ లోయ వద్ద హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. భారీ శబ్దంతో చెట్ల మీద కూలిపోయింది. మంటలు అంటుకోవడంతో అది అగ్నికీలల ఎగిసిపడ్డాయి. కూలిపోతుండగానే హెలికాప్టర్ నుంచి ఇద్దరు వ్యక్తులు బయటకు దూకారు. అప్పటికే వారికి మంటలంటుకున్నాయి. Read Also: తమిళనాడులోని కోయంబత్తూర్, కూనూరు మధ్యలో హెలికాప్టర్ కూలిపోయిన ఘటనలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక రావత్‌తోపాటు 11 మంది మృతిచెందారు. వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్ కాలేజీలో లెక్చర్ ఇచ్చేందుకు ఈ ఉదయం రావత్ దంపతులు, ఆర్మీ అధికారులతో కలిసి ప్రత్యేక విమానంలో దిల్లీ నుంచి తమిళనాడు వెళ్లారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో సూలూరు ఎయిర్‌బేస్ నుంచి ఆర్మీ హెలికాప్టర్‌లో వెల్లింగ్టన్ వెళ్తుండగా ప్రమాదవశాత్తూ కుప్పకూలింది.
By December 09, 2021 at 08:47AM
No comments