అప్పట్లో 30 రూపాయల జీతం.. నాతో బాలకృష్ణ ఆ మాటన్నారు! ఓపెన్ అయిన తమన్
ప్రెజెంట్ మ్యూజిక్ సెన్సేషన్ ఎవరంటే ముందుగా వినిపించే పేరు . సౌత్ ఇండియన్ సక్సెస్‌ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్‌గా అగ్ర హీరోలకు హుషారెత్తే మ్యూజిక్ అందిస్తున్నారు తమన్. 'అల.. వైకుంఠపురములో' సినిమాకు బాణీలు కట్టి రికార్డులు తిరగరాసిన ఆయన.. ఇటు తెలుగు అటు తమిళ సినీ పరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా మారారు. అగ్ర హీరోలు, అగ్ర దర్శకుల సినిమాలకు బెటర్ ఛాయిస్ అవుతూ బిజీ అయిపోయారు. ఈ నేపథ్యంలో తాజాగా '' ప్రోగ్రాం గెస్టుగా విచ్చేసి కాసేపు సరదా సరదాగా మాట్లాడుతూనే తన వ్యక్తిగత విషయాలపై నోరువిప్పారు తమన్. తనకు ఫ్లాప్ వస్తే ఎందుకు వచ్చిందా అనేది నేర్చుకుంటాను. అలాగే సక్సెస్ వచ్చినా కూడా ఆ సక్సెస్ నుంచి ఎంతో కొంత నేర్చుకుంటాను అని చెప్పిన తమన్ తనపై జరిగే ట్రోల్స్ గురించి ఆసక్తికరంగా స్పందించారు. అలాగే తన లైఫ్‌లో ఎదిగిన విధానం, పడిన కష్టాలు తదితర విషయాలపై ఓపెన్ అయ్యారు. తన మొదటి సినిమా హీరోగా వచ్చిన 'భైరవద్వీపం' అని చెప్పిన తమన్.. ఆ సినిమాకు డ్రమ్మర్‌గా పనిచేశానని తెలుపుతూ ఆ జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు. అప్పట్లో తన జీతం 30 రూపాయలు అని చెప్పిన తమన్.. ఇప్పుడు అదే బాలకృష్ణ గారి 'అఖండ'కి సంగీత దర్శకుడిగా చేయడం ఆనందంగా ఉందని అన్నారు. అఖండ మ్యూజిక్ అవుట్‌పుట్ చూశాక 'ఈ సినిమాకి నువ్వు కూడా హీరోవే' అని తనతో బాలకృష్ణ అన్నారని చెప్పారు. ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి చేరుకోవడానికి 20 ఏళ్ల పైన సమయం పట్టిందని తమన్ పేర్కొన్నారు. అప్పట్లో శంకర్ డైరెక్షన్‌లో వచ్చిన 'బాయ్స్' సినిమాలో ఒక చిన్న రోల్ చేసిన తాను ఇప్పుడు చరణ్‌తో ఆయన చేస్తున్న సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్‌గా పని చేస్తుండటం గర్వంగా ఉందని తమన్ అన్నారు. తనకు ఇళయరాజా గారు హార్ట్ అయితే ఏఆర్ రెహమాన్ గారు బ్రెయిన్ అని తమన్ చెప్పడం విశేషం.
By December 23, 2021 at 07:53AM
No comments