Breaking News

అమ్మకం కోసం పిల్లల్ని కని.. ఐదుగుర్ని రూ.30 లక్షలకు విక్రయించిన తండ్రి


అమ్మ జన్మనిస్తే.. నాన్న జీవితాంతం మనకు తోడుగా నిలుస్తాడు. మన ఎదుగుదల కోసం అహర్నిశలు శ్రమిస్తాడు. నిద్రాహారాలు మానుకొని అయినా సరే.. పిల్లల బాగోగుల కోసం కష్టపడతాడు. పిల్లల అభ్యున్నతి కోసం నాన్న పడే కష్టాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవు. అంతటి గొప్పదైన ‘నాన్న’ అనే పదానికి ఓ నీచుడు మచ్చ తెచ్చాడు. కటిక పేదరికంలో ఉన్నా.. ఏ తండ్రీ పిల్లలను పరాయి వాళ్లకు దత్తత ఇవ్వడానికి ఒప్పుకోడు. తనకున్న దాంట్లోనే పిల్లలను సాకడానికి ఇష్టపడతాడు. అలాంటి తండ్రులెందరో ఉన్న ఈ లోకంలో.. పిల్లలను కని, వారిని అమ్ముకోవడాన్నే సంపాదన మార్గంగా మలుచుకున్నాడో తండ్రి. సంపాదన కోసం పిల్లలను కని, తెగనమ్ముకున్న వ్యక్తికి కింద న్యాయస్థానం పదేళ్ల జైలు శిక్షను విధించింది. ఈ ఘటన చైనాలోని ప్రావిన్సుల్లో చోటుచేసుకుంది. డబ్బు కోసం సొంత బిడ్డలనే విక్రయించిన నిందితుడు.. మొత్తం ఐదుగుర్ని 28,275డాలర్లకు (రూ.31 లక్షలు) అమ్మేశాడు. విచారణ అనంతరం యూ కౌంటీ కోర్టు అతడికి 10ఏళ్ల జైలు శిక్ష విధించింది. పిల్లలను అమ్మేందుకు సహకరించిన మరో ఇద్దరికి కూడా శిక్ష ఖరారు చేసింది. యాంగ్.. అతడి భార్య యువాన్ 2012-2020 మధ్య ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులను అమ్మేశారు. ఒక్కొక్క బిడ్డను రూ.2 నుంచి రూ.9లక్షలకు విక్రయించారు. నలుగురు పిల్లలను విక్రయించేందుకు మధ్యవర్తిగా వ్యవహరించిన లీ అనే వ్యక్తికి రూ.35వేలకు వరకూ ఇచ్చారు. ఐదో బిడ్డ పుట్టిన వెంటనే ఆస్పత్రిలోని పక్క బెడ్లో ఉన్న ఓ మహిళకు యాంగ్, యువాన్ దంపతులు విక్రయించారు. ఈ కేసులో మధ్యవర్తి, అతని కోడల్ని దోషులుగా నిర్ధారించిన న్యాయస్థానం.. లీకి ఏడేళ్లు, డువాన్‌కు 21నెలల జైలు శిక్ష ఖరారు చేసింది. తల్లిదండ్రులే కన్న బిడ్డలను విక్రయించడం అత్యంత హేయమైన చర్య అని కోర్టు వ్యాఖ్యానించింది. పిల్లల్లి ప్రేమతో పెంచి పెద్ద చేయాల్సిన వారే వాళ్లని వ్యాపార సాధనంగా చూశారని మండిపడింది. కేవలం డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతోనే పిల్లల్లి కన్నారు తప్ప మరో కారణం లేదని మండిపడింది. ఇలా చేయడం మైనర్ల హక్కులను కాలరాయడమే గాక, అక్రమ వ్యాపారాన్ని ప్రోత్సహించినట్లవుతుందని స్పష్టం చేసింది చైనాలో 80,90 దశకంలో పిల్లల అక్రమ రవాణా నేరాలు అధికంగా ఉండేవని 'ది సౌత్ మార్నింగ్ పోస్ట్' నివేదిక తెలిపింది. అప్పట్లో 'వన్ ఆర్ నన్ (ఒక్కరే ముద్దు- అసలే వద్దు)' అనే పాలసీని ప్రభుత్వం తీసుకువచ్చిన తర్వాత కూడా ఇలాంటి నేరాలు జరుగుతూనే ఉన్నాయని పేర్కొంది. చైనా ప్రజా భద్రత వివరాల ప్రకారం.. పిల్లల అహహరణ కేసులు 2012లో 6,000గా ఉండగా.. 2021 నాటికి ఆ సంఖ్య 666కి తగ్గినట్లు వెల్లడించింది. చైనాలో డబ్బుల కోసం పిల్లలను తల్లిదండ్రులు అమ్మేసే ఘటనలు తరచూ జరుగుతూనే ఉంటాయి. ఈ ఏడాది మే నెలలో దక్షిణ జెజియాంగ్ రాష్ట్రంలో జీ అనే ఓ వ్యక్తి విదేశీ పర్యటన కోసం తన రెండేళ్ల కుమారుడ్ని రూ.15లక్షలకు అమ్మేశాడు. అలాగే, ఫుజీ ప్రావిన్సులకు చెందిన ఓ వ్యక్తి తన రెండేళ్ల కుమార్తెను రూ. 9.60 లక్షలకు అమ్మేయగా.. అతడికి న్యాయస్థానం ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. తాజా, కేసులో భార్య సహకారం ఉందా? అనేది స్పష్టత లేదు. కానీ, ఈ నేరంలో ఆమెకు న్యాయస్థానం ఎటువంటి శిక్ష ఖరారు చేయలేదు.


By December 17, 2021 at 10:19AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/man-sold-his-five-children-to-human-traffickers-in-hebe-of-china/articleshow/88332572.cms

No comments