Breaking News

Wuhan కరోనాపై రిపోర్టింగ్.. ఏడాదిన్నరగా నిర్బంధం.. చావు బతుకుల్లో చైనా జర్నలిస్ట్


మూల కేంద్రం వుహాన్‌లో పరిస్థితులు, అధికార యంత్రాంగం తీసుకున్న చర్యలపై రిపోర్టింగ్ చేసిన మహిళా జర్నలిస్ట్‌‌ను చైనా ప్రభుత్వం అరెస్ట్ చేసింది. గతేడాది మేలో అరెస్టయిన ఆమెకు.. డిసెంబరులో అక్కడి కోర్టు నాలుగేళ్ల జైలు శిక్షను విధించింది. తనను విడుదల చేయాలని కోరుతూ ప్రస్తుతం జైల్లో నిరాహార దీక్ష చేస్తున్న ఆమె పరిస్థితి విషమంగా ఉంది. తమ కుమార్తెను తక్షణమే విడుదల చేయాలని కుటుంబసభ్యులు, మానవహక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సిటిజన్ జర్నలిస్ట్ (38) గతేడాది ఫిబ్రవరిలో వుహాన్‌లో పర్యటించింది. కోవిడ్ పరిస్థితులు, అధికారులు తీసుకున్న చర్యల గురించి తన స్మార్ట్ ఫోన్‌లో వీడియోలను చిత్రీకరించి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో చైనా ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమెను అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. ప్రస్తుతం నిరాహార దీక్షతో నీరసించిపోయిన ఆమె ప్రాణాలకు ప్రమాదం ఉందని ఝంగ్ సోదరుడు ఝంగ్ జూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆమరణ నిరాహార దీక్షలో ఉన్న ఆమెకు బలవంతంగా ముక్కు ద్వారా ఆహారం ఇస్తున్నారని ఝంగ్ తరఫున న్యాయవాదులు తెలిపారు. తన ఆరోగ్య పరిస్థితి గురించి కూడా మాకు సమాచారం లేదని ఆరోపించారు. ‘వచ్చే శీతాకాలం వరకూ ఆమె ప్రాణాలతో ఉండకపోవచ్చు.. ఆమె హృదయంలో దేవుడు, నమ్మకాలు మాత్రమే ఉంటాయి.. మరేదైనా పట్టించుకోదు’ అని సోదరుడు ట్విట్ చేశారు. తన సోదరి విడుదల కోసం ట్విట్టర్‌లో ఝంగ్ జూ చేసిన పోస్ట్‌లపై అమ్నేస్టీ ఇంటర్నేషనల్ స్పందించింది. ఆమెను తక్షణమే విడుదల చేసి, నిరాహార దీక్ష విరమింపజేసి, తగిన వైద్య సహాయం అందజేయాలని చైనా ప్రభుత్వాన్ని కోరింది. ఝంగ్ నిర్బంధం మానవహక్కులపై జరిగిన సిగ్గుమాలిన చర్యగా అమ్నేస్టీ ఇంటర్నేషనల్ కాంపెయినర్ గ్వెన్ లీ అన్నారు. షాంఘై జైల్లో ఉన్న ఆమెను మూడు వారాల కిందట కలుసుకోడానికి కుటుంబసభ్యులు ప్రయత్నించినా అనుమతివ్వడం లేదని ఝంగ్ సన్నిహితుడొకరు ఏఎఫ్‌పీతో చెప్పారు. ప్రస్తుతం ఆమె నడవలేని స్థితిలో ఉన్నారని రిపోర్ట్స్ వితౌట్ బోర్డర్స్ (ఆర్ఎస్ఎఫ్) తెలిపింది. ఝంగ్ తక్షణ విడుదలకు చైనాపై అంతర్జాతీయ సమాజం ఒత్తిడి తీసుకురావాలని ఆర్‌ఎస్ఎఫ్ తూర్పు ఆసియా బ్యూరో హెడ్ కెడ్రిక్ అల్వియని అన్నారు.


By November 05, 2021 at 12:01PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/journalist-zhang-zhan-jailed-for-covid-coverage-in-china-now-close-to-death/articleshow/87534739.cms

No comments