Acharya : ‘ఆచార్య’ నుంచి నీలాంబరి లిరికల్ సాంగ్... తన మార్క్ చూపిన మణిశర్మ
మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్రలో నటిస్తోన్న కమర్షియల్ ఎంటర్‌టైనర్ ‘ఆచార్య’. మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ ఇందులో సిద్ధ అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటి వరకు రామ్‌చరణ్ పోస్టర్స్‌ను మాత్రమే విడుదల చేసిన చిత్ర యూనిట్ శుక్రవారం రోజున ‘నీలాంబరి..’ అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేసింది. రామ్‌చరణ్, పూజా హెగ్డేలపై సాగే మెలోడీ సాంగ్ అది. కూల్, బ్రీజీగా వినసొంపుగా ఉంది. చాలా రోజుల తర్వాత చిరంజీవి సినిమాకు మర్క్ చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ మెలోడీ బ్రహ్మ మణిశర్మ తన మార్క్‌లో చక్కటి ట్యూన్‌ను అందించారు. ఈ లిరికల్ సాంగ్‌తో పాటు పాటలోని కొన్ని మూమెంట్స్, అసలు పాటను ఎలా చిత్రీకరించాలనే మేకింగ్‌ను చూపించారు. చరణ్, పూజా హెగ్డే జోడీ స్క్రీన్‌పై చూడటానికి అందంగా కనిపిస్తుంది. ఆచార్య సినిమాలో చిరంజీవి, రామ్‌చరణ్ ఇద్దరూ నక్సలైట్స్‌గా కనిపించనున్నారు. అన్యాక్రాంతమైన దేవాదాయ భూముల గురించి పోరాటం చేస్తారు. సినిమాలో కీలకంగా ఉండే ఓ ఆలయం సెట్‌ను హైదరాబాద్ శివారు ప్రాంతంలో భారీగా ఖర్చు పెట్టి నిర్మించారు. ఆసియాలో ఇప్పటి వరకు వేసిన టెంపుల్ సెట్స్‌లో ఇదే అతి పెద్ద సెట్ అని టాక్. సాహి సురేశ్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేశారు. ఇందులో చిరంజీవి జోడీగా కాజల్ అగర్వాల్ కనిపించనుంది. మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రాలను కమర్షియల్ పంథాలో తెరకెక్కించడంలో సిద్ధహస్తుడైన డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఫిబ్రవరి 4న సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలవుతుంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకాలపై శ్రీమతి సురేఖ సమర్పణలో నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, లాహే లాహే సాంగ్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. లాహే లాహే సాంగ్.. చిరంజీవి మీద సాగే పాట.. కాగా ఇప్పుడు విడుదలైన నీలాంబరి మాత్రం చరణ్, పూజా హెగ్డేలపై సాగే పాట. సినిమా షూటింగ్‌ను ఎప్పుడో పూర్తి చేసిన చిరంజీవి ఇప్పుడు గాడ్‌ఫాదర్ షూటింగ్‌ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. మరోవైపు మెహర్ రమేశ్ సినిమా నవంబర్ 11 నుంచి ప్రారంభం అవుతుంది. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.
By November 05, 2021 at 12:08PM
No comments