Tamannaah Bhatia : మహలక్ష్మి గెటప్‌లో టిఫిన్ చేస్తోన్న మిల్కీబ్యూటీ తమన్నా!
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiznnF_dSNJNvA7yvMGlS2F8Mp5p3q7_b2yjJ-12wu0tJ_HB8Frugro8tY7agbK2o40802tzyVnkF7SLEmUEF0SRc3h4PFPyKfHtXXVQw_fa3WMWAne87UyT4uozsGJ74M24g_TnYYg4Wc/s320/Movie.jpg)
![](https://telugu.samayam.com/photo/87888222/photo-87888222.jpg)
మన స్టార్స్ అప్పుడప్పుడు మనకిచ్చే షాకులు మామూలుగా ఉండవు. డిఫరెంట్ గెటప్‌లో కనపడి ఆకట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు మన మిల్కీబ్యూటీ తమన్నా కూడా అలాగే చేసింది. ఆమె వేసిన డిఫరెంట్ గెటప్ చూసి అభిమానులు, ప్రేక్షకులు ఆనందంతో షాకయ్యారనే చెప్పాలి. ఇంతకీ అంతలా తమన్నా ఏ గెటప్ వేసిందబ్బా అనే సందేహం రాక మానదు. మిల్కీబ్యూటీ కనిపించిన గెటప్ ఏదో తెలుసా మహలక్ష్మి. ఈ దేవతా మూర్తి అవతారంలో తమన్నా నిలబడి వరాలను కురిపించడం లేదు సుమా. వెరైటీగా టిఫిన్ చేస్తుంది. అసలు తమన్నా ఎందుకు మహలక్ష్మిగా మారాల్సి వచ్చిందంటే సినిమా కోసం. ఏ సినిమా కోసం ఆమె ఈ వేషం వేసి ఉండొచ్చు ఊహించండి. అంత కష్టమెందుకులెండి..అది కూడా మేమే చెప్పేస్తాం కోసం. అనీల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోన్నF3 మూవీ డబ్బు వల్ల మనుషులు ఎలాంటి ఫ్రస్టేషన్‌కు గురవుతున్నారనే కథాంశంతో రూపొందిస్తున్నారు. డబ్బుకి అధినేత ఎవరు మహలక్ష్మి. ఈ సినిమా సన్నివేశ చిత్రీకరణలో భాగంగా తమన్నా మహలక్ష్మి వేషాన్ని వేసి టిఫన్ చేసింది. ఆ ఫొటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. F3 తో పాటు ఇప్పుడు తమన్నా తెలుగులో చేస్తున్న మరో సినిమా భోళా శంకర్. మెగాస్టార్ చిరంజీవికి జతగా ఇందులో తమన్నా మెప్పించనుంది. మోడ్రన్ అమ్మాయి పాత్ర. ఇది వరకు చిరంజీవితో తమన్నా చేసిన చిత్రం సైరా నరసింహారెడ్డి. ఇందులో మిల్కీబ్యూటీ మెయిన్ హీరోయిన్ కాకపోయినా, ఆమె పోషించిన పాత్రకు చాలా మంచి పేరు వచ్చింది. ఆ పాత్రకు పూర్తి భిన్నమైన పాత్రను భోళా శంకర్ చిత్రంలో తమన్నా చేస్తుందని దర్శకుడు మెహర్ రమేశ్ ఇది వరకే చెప్పాడు. హీరోయిన్‌గానే చేయాలని నిబంధన పెట్టుకోకుండా గ్రే షేడ్స్ ఉన్న పాత్రను కూడా మాస్ట్రోలో చేసి ప్రేక్షకులను మెప్పించింది. దాదాపు పదిహేను సంవత్సరాలుగా సినీ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా రాణిస్తూ అగ్ర కథానాయకులందరితో సినిమాలు చేసిన, చేస్తున్న మిల్కీబ్యూటీ తనదైన గుర్తింపును సంపాదించుకున్న తమన్నా ట్రెండ్‌కు తగినట్లు తమన్నా సినిమాలు చేయడానికి సిద్ధమవుతోంది. అలాగే సిల్వర్ స్క్రీన్‌కే పరిమితమవకుండా ఓటీటీల్లో అడుగు పెట్టి ఆకట్టుకుంది. ఆహాలో లెవన్త్ అవర్ అనే వెబ్ సిరీస్‌లో తమన్నా మెయిన్ రోల్ పోషించిన సంగతి తెలిసిందే. అలాగే మాస్టర్ చెఫ్ అనే వంటల ప్రోగ్రామ్‌కి కూడా తమన్నా హోస్ట్‌గా వ్యవహరించింది.
By November 24, 2021 at 03:40PM
No comments