Breaking News

Taliban భారత్‌వైపు వచ్చే సాహసం చేస్తే.. ఎయిర్‌స్ట్రైక్స్ తప్పవు.. యూపీ సీఎం సంచలన వ్యాఖ్యలు


తాలిబన్ల ఆగడాలతో పాకిస్థాన్, అఫ్గనిస్థాన్ ఆందోళన చెందుతున్నాయని, ఒకవేళ ముష్కర మూకలు భారత్‌వైపు వచ్చే సాహసం చేస్తే ఎయిర్‌స్ట్రైక్స్ తప్పవని యూపీ సీఎం హెచ్చరించారు. ఆయన ఆదివారం లక్నోలో సామాజిక ప్రతినిధుల సమ్మేళనంలో మాట్లాడుతూ.. ప్రతిపక్షాలపై కూడా విమర్శలు గుప్పించారు. ‘‘ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో నేడు దేశం శక్తివంతంగా ఉంది.. ఏ దేశమూ భారత్‌ వైపు దృష్టి సారించే సాహసం చేయలేకపోతోంది.. నేడు పాకిస్థాన్‌, అఫ్గనిస్థాన్‌లు తాలిబాన్ల వల్ల కలవరపడుతున్నాయి.. కానీ, తాలిబన్లు భారత్‌వైపు వస్తే తాము వైమానిక దాడికి సిద్ధంగా ఉన్నాం’’ అని సీఎం యోగి హెచ్చరించారు. వచ్చే ఏడాది యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఎం యోగి విపక్షాలపై విమర్శలు ఎక్కుపెట్టారు. యూపీ అభివృద్ధితో ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్‌లకు సంబంధం లేదని సీఎం ధ్వజమెత్తారు. రామభక్తులను హత్య చేసిన వారికి దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పే ధైర్యం ఉందా? అని పరోక్షంగా సమాజ్‌వాదీ పార్టీని ఆదిత్యనాథ్ ప్రశ్నించారు. ఎస్బీఎస్పీ అధ్యక్షుడు ఓమ్ ప్రకాశ్ రాజ్‌భర్‌పై కూడా పరోక్షంగా యోగి విమర్శలు గుప్పించారు. ఆయన ఆలోచనంతా తన కుటుంబం అభివృద్ధి కోసమేనని ధ్వజమెత్తారు. ‘తండ్రి మంత్రి కావాలనుకుంటే.. ఓ కొడుకు ఎంపీ.. మరొకరు ఎమ్మెల్సీ పదవి కోసం ఆరాటపడుతున్నారు.. బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడే వారి దుకాణాలు మూసివేయాలి’ అని అన్నారు. మా క్యాబినెట్‌లో రాజ్‌భర్ కమ్యూనిటీ నుంచి ఇద్దరు మంత్రులు ఉన్నారు.. వీరిలో ఒకరు క్యాబినెట్ సమావేశంలో బహ్రైచ్‌లో మహారాజా సుహెల్‌దేవ్ గౌరవార్థం స్మారక కట్టడాన్ని వ్యతిరేకించారు.. అయితే అనిల్ రాజ్‌భర్ ఒక గొప్ప స్మారకాన్ని నిర్మించాలని కోరారు’ అని తెలిపారు. బహ్రైచ్‌లో గొప్ప స్మారకాన్ని ఇప్పుడు నిర్మించాం.. మెడికల్ కాలేజీకి సుహెల్‌దేవ్ పేరును బీజేపీ పెట్టడాన్ని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి’ అన్నారు.


By November 01, 2021 at 08:40AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/if-taliban-moves-towards-india-air-strike-is-ready-says-up-cm-yogi-adityanath/articleshow/87450521.cms

No comments