Breaking News

Surya - Jai Bhim : సిన‌త‌ల్లికి రూ.10 లక్షలు సాయం ప్ర‌క‌టించిన హీరో సూర్య‌.. ‘జై భీమ్‌’ను టార్గెట్ చేసిన పొలిటిక‌ల్ పార్టీ..సూర్య‌ స‌పోర్ట్ చేస్తున్న ఇత‌ర హీరోల ఫ్యాన్స్‌


తమిళంతో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉన్న హీరోల్లో సూర్య ముందు వ‌రుస‌లో ఉంటారు. ఆయ‌న త‌న సినిమాల‌ను ఇక్క‌డ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకునే చేస్తుంటారు. ఏక కాలంలో విడుద‌ల చేస్తుంటారు. అయితే క‌రోనా ప‌రిస్థితుల త‌ర్వాత సూర్య త‌న సినిమాల‌ను నేరుగా ఓటీటీల్లోనే విడుద‌ల చేస్తూ వ‌స్తున్నారు. తాజాగా ఈయ‌న హీరోగా న‌టించిన చిత్రం ‘’. తమిళనాడులో జరిగిన ఓ య‌థార్థ ఘ‌ట‌న‌ను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందించారు. సినిమాకు ప్రేక్ష‌కులు, విమర్శ‌కుల నుంచి చాలా మంచి ఆద‌ర‌ణ ద‌క్కింది. సినిమాలో చూపించిన సిన‌త‌ల్లి పాత్ర‌ధారి ఇంకా బ‌తికే ఉంది. ఈమెకు సూర్య త‌న వంతు సాయంగా రూ.10 ల‌క్ష‌ల ఆర్థిక సాయాన్నిచేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. మ‌రో హీరో, ద‌ర్శ‌కుడు లారెన్స్ అయితే ఆమెకు ఇల్లు కూడా క‌టిస్తాన‌ని అనౌన్స్ చేశారు. గిరిజనుడైన సిన త‌ల్లి భ‌ర్త రాజ‌న్న‌ను అకార‌ణంగా ఓ దొంగ‌త‌నం కేసులో పోలీసులు ఇరికించ‌డం, పోలీసులు కొట్ట‌డం వ‌ల్ల ఆయ‌న చ‌నిపోవ‌డం జ‌రిగాయి. ఆ రాజ‌న్న కేసును అప్ప‌ట్లో సిన‌త‌ల్లికి స‌పోర్ట్‌గా కోర్టులో వాదించి గెలిచిన లాయ‌ర్ చంద్రు కూడా ఇంకా బ‌తికే ఉన్నారు. ఆయ‌న పాత్ర‌లోనే సూర్య న‌టించారు. ఈ సినిమా విడుద‌ల త‌ర్వాత కొన్ని రాజ‌కీయ పార్టీలు దీన్ని పొలిటిక‌ల్ కోణంలో చూపించాల‌నే ప్ర‌య‌త్నం చేశాయి. ఇత‌ర భాష‌ల‌తో ప‌ని లేదంటూ సూర్య త‌న సినిమాను ఇత‌ర భాష‌ల్లో విడుద‌ల చేసుకోవ‌డంపై బీజేపీ జాతీయ కార్య‌ద‌ర్శి హెచ్‌.రాజా విమ‌ర్శ‌లు చేశారు. దానిపై సూర్య స్పందించ‌లేదు. తాజాగా జై భీమ్‌పై మ‌రో వివాదాన్ని రేపారు. ఆ సినిమాలో వ‌న్నియార్ అనే కుల‌స్థుల‌ను త‌క్కువ చేసి చూపించే ప్ర‌య‌త్నం చేశారంటూ త‌మిళ‌నాడు పీఎంకే పార్టీకి చెందిన అన్భుమ‌ణి ఆరోప‌ణ‌లు చేశారు. దీనిపై సూర్య త‌న‌దైన శైలిలో స్పందించారు. ఒక‌రిని త‌క్కువ చేసి చూపించే ప్ర‌య‌త్నం తానెప్పుడూ చేయ‌న‌ని క్లారిటీ ఇచ్చేశారు. సూర్యకు సోష‌ల్ మీడియాలో ఆయ‌న అభిమానుల నుంచే కాదు.. ఇత‌ర హీరోల అభిమానుల నుంచి కూడా స‌పోర్ట్ ల‌భిస్తుంది. అంద‌రూ క‌లిసి అనే హ్యాష్ ట్యాగ్‌ను క్రియేట్ చేసి సూర్య త‌మ మ‌ద్ద‌తుని తెలియ‌జేస్తున్నారు. హీరో సూర్య సిల్వ‌ర్ స్క్రీన్‌పైనే కాదు, రియ‌ల్ లైఫ్‌లోనూ హీరోనే. ఎందుకంటే ఆయ‌న అగ‌రం అనే ఫౌండేష‌న్‌ను స్థాపించి దాని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థుల‌కు విద్య‌ను అందిస్తున్నారు. విపత్తులు వచ్చినప్పుడు ఎన్నో సార్లు పెద్ద మ‌న‌సు చాటుకుంటూ విరాళాలు ప్ర‌క‌టిస్తూ వ‌స్తున్న సూర్య అండ్ ఫ్యామిలీ ఇప్పుడు మ‌రో అడుగు ముందుకేసింది. గిరిజ‌న విద్యార్థుల కోసం సూర్య కోటి రూపాయ‌ల‌ను విరాళంగాత‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ఎం.కె.స్టాలిన్‌ను క‌లిసి అందించారు.


By November 15, 2021 at 11:05AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/jai-bhim-surya-announced-10-lakhs-to-sinathalli/articleshow/87710205.cms

No comments