Breaking News

RRR నుంచి డైలాగ్ లీక్ చేసిన రాజమౌళి.. అదిరిపోయిందంతే!


పాన్ ఇండియా ప్రేక్ష‌కులంద‌రూ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న భారీ బ‌డ్జెట్ మూవీ ‘RRR ’. ‘బాహుబ‌లి’ త‌ర్వాత రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న సినిమా కావ‌డంతో బాలీవుడ్ వ‌ర్గాలు ఆస‌క్తిగా ఎదురుచూస్తుండ‌గా.. టాలీవుడ్ స్టార్ హీరోలైన యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్ మూవీ కావ‌డంతో ఇటు మెగా ఫ్యాన్స్‌, అటు నందమూరి ఫ్యాన్స్‌తో పాటు టాలీవుడ్ ప‌రిశ్ర‌మ అంతా ఎదురుచూస్తుంది. అగ్ర న‌టీన‌టులు చేసిన సినిమా కావ‌డంతో సినిమా క‌లెక్ష‌న్స్ ప‌రంగా ఎలాంటి సంచ‌నాల‌కు తెర తీస్తుందోనిన ట్రేడ్ వ‌ర్గాలు ఎదురుచూస్తున్నాయి. ఇంత మందిలో ఆస‌క్తి పెంచుతోన్న ఈ సినిమా వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 7న వ‌స్తుంది. జ‌క్క‌న్న ఇప్ప‌టి నుంచే సినిమా ప్ర‌మోష‌న్స్‌ను ఓప్లానింగ్ ప్ర‌కారం చేసుకుంటూ వ‌స్తున్నారు. రీసెంట్‌గా ఓ సందర్భంలో మాట్లాడుతూ సినిమాలోని ఓ డైలాగ్‌ను లీక్ చేశారు. ‘‘యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు అవంత‌ట అవే వ‌స్తాయి. అది ధ‌ర్మ యుద్ధ‌మైన‌ప్పుడు విజ‌యం వరిస్తుంది’’ అనే ఓ డైలాగ్‌ను మాట‌ల సంద‌ర్భంలో రాజ‌మౌళి చెప్పారు. ఇటు మెగాభిమానులు, అటు నంద‌మూరి అభిమానులు కేరింత‌లు కొట్టేలా వారి పాత్ర‌ల‌ను హైలైట్ చేసేలా ఈ డైలాగ్ ఉంది. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్స్‌, సాంగ్‌, గ్లింప్స్‌కు ప్రేక్ష‌కుల నుంచి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా మ‌రో సాంగ్‌ను విడుద‌ల చేయ‌డానికి రెడీ అయ్యారు. ఈ పాటలో రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి డాన్స్ చేయడాన్ని చూడొచ్చు. ఈ సాంగ్ ప్రోమోను ఈరోజు 11 గంట‌ల‌కు విడుద‌ల చేస్తున్నారు. పూర్తి పాటను రేపు విడుదల చేస్తారు. కచ్చితంగా అభిమానులకు కిక్ ఇచ్చే సాంగ్ అవుతుందనడంలో సందేహమే లేదు. ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌ల‌తో పాటు ఆలియా భ‌ట్‌, అజ‌య్ దేవ‌గ‌ణ్‌, శ్రియా శ‌రన్‌, స‌ముద్ర‌ఖ‌ని, రే స్టీవెన్ స‌న్‌, అలిస‌న్ డూడి, ఒలివియా మోరిస్ వంటి బాలీవుడ్, హాలీవుడ్ స్టార్స్ న‌టిస్తున్న చిత్ర‌మిది. నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో డి.వి.వి.దాన‌య్య ఈ పాన్ ఇండియా మూవీని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. 1920 బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఫిక్ష‌న‌ల్ పీరియాడిక‌ల్ డ్రామా ఇది. ఇందులో రామ్‌చ‌ర‌ణ్ మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్ర‌లో క‌నిపిస్తుంటే, ఎన్టీఆర్‌.. గోండు వీరుడు కొమురం భీమ్‌గా క‌నిపించ‌నున్నారు. భారతదేశ స్వాతంత్య్రం కోసం పోరాడి అమరులైన ఇద్దరు యోధులు చరిత్ర ప్రకారం కలుసుకోలేదు. ఒవకేవల వాళ్లు కలుుసుకుని ఉండి, వారి ఆలోచనలు పంచుకోవడం చేసుంటే ఎలా ఉండేదనే పాయింట్‌ను ఊహించిన జక్కన్న ఈ సినిమాను తెరకెక్కించానని తెలిపారు.


By November 09, 2021 at 07:07AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/rrr-dialouge-leaked-by-rajamouli/articleshow/87595988.cms

No comments