Breaking News

RRR సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంతో తెలిస్తే షాకవుతారు


బాహుబ‌లితో పాన్ ఇండియా డైరెక్ట‌ర్‌గా ఎదిగి..ప్ర‌పంచ స్థాయిలో మ‌న సినిమాను నిల‌బెట్టిన ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం . టాలీవుడ్ టాప్ స్టార్స్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా న‌టించారు. భారీ అంచ‌నాల‌ను ఏర్ప‌రుచుకున్న ఈ సినిమాను వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 7న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ప్రీ ఇండిపెండెన్స్ 1920 బ్యాక్‌డ్రాప్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో తెలంగాణ గోండు వీరుడు కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌, మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజుగా రామ్‌చ‌ర‌ణ్ క‌నిపిస్తోన్న సంగ‌తి తెలిసిందే. వీరిద్ద‌రూ క‌లుసుకోలేదు. కానీ క‌లుసుకుని ఉంటే.. బ్రిటీష్‌వారిని వీరిద్ద‌రూ ఎదిరిస్తే ఎలా ఉంటుంద‌నే క‌ల్పిత క‌థాంశమే ఈ మూవీ. ఆలియా భ‌ట్‌, అజ‌య్ దేవ‌గ‌ణ్‌, స‌ముద్ర‌ఖ‌ని, శ్రియా శ‌ర‌న్‌తో పాటు హాలీవుడ్ స్టార్స్ ఒలివియా మోరిస్‌, రే స్టీవెన్ స‌న్‌, అలిస‌న్ డూడీ ఈ సినిమాలో ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టించారు. అస‌లు ఈ సినిమా ర‌న్ టైమ్ ఎంత ఉంటుంద‌నే విష‌యంపై నెట్టింట కొన్ని రోజుల ముందు పెద్ద చ‌ర్చే జ‌రిగింది. తాజాగా RRR ర‌న్‌టైమ్‌పై వార్తొక‌టి నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. స‌మాచారం మేర‌కు RRR సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని ‘యు/ఎ’ సర్టిఫికేట్‌ను పొందింది. మొత్తం ఎడిటింగ్ పూర్త‌యిన త‌ర్వాత సినిమా ర‌న్ టైమ్‌ను జ‌క్క‌న్న 3 గంట‌ల 6 నిమిషాలుగా కుదించారు. నిజానికి ద‌ర్శ‌క‌ధీరుడు మూడు గంట‌ల లోపే ర‌న్ టైమ్‌ను ఫిక్స్ చేయాల‌నుకుని ఎడిటింగ్‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ కూడా పెట్టార‌ట‌. అయితే ఆయ‌న అనుకున్న ఫీల్‌ను సినిమాను తీసుకు రావ‌డానికి 186 నిమిషాల వ్య‌వ‌థి ఉన్న సినిమానే సూట్ అవుతుంద‌ని భావించి దానితోనే సెన్సార్‌ను పూర్తి చేయించార‌ట రాజ‌మౌళి. RRRకు ప్ర‌ధాన‌మైన ఆత్మ‌వంటి జ‌న‌ని... సాంగ్‌ను చిత్ర యూనిట్ రీసెంట్‌గా విడుద‌ల చేసింది. ఈ సాంగే సినిమాకు ప్ర‌ధాన‌మైన‌ద‌ని రాజ‌మౌళి గ‌ట్టి న‌మ్మ‌కంతో ఉన్నారు. ఈ పాట‌ను మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎం.ఎం.కీర‌వాణి రాయ‌డం విశేషం. డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై డి.వి.వి.దాన‌య్య ఈ చిత్రాన్ని రూ.400 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో సినిమాను నిర్మించారు. సినిమా ప్ర‌మోష‌న్స్ విష‌యంలోనూ రాజ‌మౌళి అస్స‌లు త‌గ్గ‌డం లేదు. ఇండియాలోని ప్ర‌ధాన న‌గ‌రాల‌కు వెళ్లి సినిమాను ప్ర‌మోట్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అందుకోసం ప్ర‌త్యేక విమానంలో ఎంటైర్ యూనిట్ ట్రావెల్ చేయ‌నుంది. డిసెంబ‌ర్ 4 నుంచి రాజ‌మౌళి ప్ర‌మోష‌న్స్‌ను షురూ చేయ‌నున్నారు. RRR ట్రైల‌ర్‌ను కూడా డిసెంబ‌ర్ మొద‌టి వారంలోనే విడుద‌ల చేస్తామ‌ని రాజ‌మౌళి తెలిపారు.


By November 28, 2021 at 09:35AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/rrr-censor-completed-and-run-time-fixed/articleshow/87958033.cms

No comments